ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విజయంకన్నా.. పోటీల్లో పాల్గొనడం ముఖ్యం

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:39 PM

గెలుపొందడం కన్నా.. క్రీడా పోటీల్లో పాల్గొనడం ముఖ్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరులోని మెసానికల్‌ మైదానంలో మంగళవారం ఆయన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

బ్యాటింగ్‌ చేసి పోటీలను ప్రారంభిస్తున్న మంత్రి

‘ఆడుదాం ఆంధ్రా’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు క్రీడలు, డిసెంబరు 26: గెలుపొందడం కన్నా.. క్రీడా పోటీల్లో పాల్గొనడం ముఖ్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరులోని మెసానికల్‌ మైదానంలో మంగళవారం ఆయన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కనుమరుగవుతున్న గ్రామీణ క్రీడలైన ఖో-ఖో, కబడ్డీని బతికించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు తెలిపారు. జిల్లాలో 612 సచివాలయల పరిధిలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు చేరుకుని జిల్లాకు మంచి పేరు తేవాలని ఎస్పీ రిషాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, మేయర్‌ అముద, మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుల్లెట్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:39 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising