రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:12 AM
ఐరాల మండలం చంద్రయ్యగారిపల్లె వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
ఐరాల, డిసెంబరు 25: ఐరాల మండలం చంద్రయ్యగారిపల్లె వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఐరాల ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు చంద్రయ్యగారిపల్లెకు చెందిన గుర్రప్ప(లోకనాథం)(37) తన ద్విచక్ర వాహనంపై భార్య పూజతో వెళుతుండగా, నెల్లిమందలపల్లె అరుంధతివాడకు చెందిన మనోజ్ తన ముందు వెళుతున్న రాజశేఖర్‌ను ఢీకొన్నాడు. దీంతో మనోజ్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న గుర్రప్ప వాహనాన్ని ఢీకొనడంతో అతడు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పూజ, రాజశేఖర్‌కు గాయ్యాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Dec 26 , 2023 | 12:12 AM