కొండపై ఎమ్మెల్యే హంగామా
ABN, First Publish Date - 2023-10-30T02:27:13+05:30
తిరుమల వెంకన్న దర్శనానికి సామాన్య భక్తులకు తప్ప తమకు నిబంధనలు వర్తించవన్నట్టుగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు.
వీఐపీ బ్రేక్‌లో 93 మంది అనుచరులతో
గొర్లె కిరణ్‌కుమార్ శ్రీవారి దర్శనం
నిబంధనల ప్రకారం 10 మందికే అనుమతి
ఎమ్మెల్యే తీరుతో సామాన్య భక్తులకు అసౌకర్యం
తిరుమల, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తిరుమల వెంకన్న దర్శనానికి సామాన్య భక్తులకు తప్ప తమకు నిబంధనలు వర్తించవన్నట్టుగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఓ ఎమ్మెల్యే ఒకసారి వీఐపీ బ్రేక్‌లో పదిమందితో కలసి శ్రీవారిని దర్శించుకోవచ్చు. అయితే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ తన వెంట పెద్ద గుంపును వేసుకుని వెళ్లారు. ఆదివారం దాదాపు 93 మంది అనుచరులతో తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్‌లో దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలతో కలిసి వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లారు. రద్దీ ఉండే ఆదివారం రోజున సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగేలా ఇంతమందితో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. గతంలో కూడా పలువురు మంత్రులు శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
Updated Date - 2023-10-30T02:27:13+05:30 IST