ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఒకే ఇంట్లో పదికి మించి ఓటర్లుంటే వారంలోగా పరిశీలన: జేసీ

ABN, Publish Date - Dec 14 , 2023 | 12:37 AM

జిల్లాలో ఒకే చిరునామాలో పదికి మించి ఓటర్లున్న అంశాలకు సంబంధించి వారంలోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేస్తామని జేసీ శ్రీనివాసులు అన్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 13: జిల్లాలో ఒకే చిరునామాలో పదికి మించి ఓటర్లున్న అంశాలకు సంబంధించి వారంలోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేస్తామని జేసీ శ్రీనివాసులు అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖే్‌షకుమార్‌ మీనా అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చిత్తూరు నుంచి పాల్గొన్న జేసీ మాట్లాడుతూ ఈ అంశంపై పలు సాంకేతిక సమస్యలు ఉన్నాయని ఎన్నికల అధికారికి వివరించారు. అందుకు ఎన్నికల అధికారి మీనా మాట్లాడుతూ పారదర్శకంగా ఓటరు జాబితా తయారు చేసేవిధంగా చూడాలన్నారు. సాంకేతికపరమైన సమస్యలు ఉంటే రాష్ట్ర ఎన్నికల కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రాజశేఖర్‌, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్‌ బ్యూలా, సాంకేతిక అధికారి ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 12:37 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising