రేపు గవర్నర్ రాక
ABN, Publish Date - Dec 17 , 2023 | 01:40 AM
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమ, మంగళవారాలు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ వెంకటరమణారెడ్డి శనివారం తెలిపారు.
తిరుపతి (కలెక్టరేట్), డిసెంబరు 16: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమ, మంగళవారాలు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ వెంకటరమణారెడ్డి శనివారం తెలిపారు. సోమవారం బెంగళూరు నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని, మధ్యాహ్నం 3 గంటలకు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగే వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొంటారని పేర్కొన్నారు. అదే రోజు రాత్రి తిరుమలకు చేరుకుని బస చేస్తారని, మంగళవారం ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకుని రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరుతారని తెలిపారు.
Updated Date - Dec 17 , 2023 | 01:40 AM