ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా గోపీనాథ్‌

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:18 PM

ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) జిల్లా అధ్యక్షుడిగా గోపీనాథ్‌ను రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గోపీనాథ్‌, ముక్తార్‌

చిత్తూరు (సెంట్రల్‌), డిసెంబరు 17: ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) జిల్లా అధ్యక్షుడిగా గోపీనాథ్‌ను రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక జైహింద్‌ పాఠశాలలో జరిగిన ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా ముక్తార్‌ అహ్మద్‌, ఉపాధ్యక్షులుగా అప్జల్‌ బాషా, నవీన్‌కుమార్‌, జగదీష్‌, దీపాదేవి, కార్యదర్శులుగా గురుమూర్తి, లక్ష్మిపతి, ప్రభాకర్‌, సుబ్రమణ్యం, వేణు, కార్యవర్గ సభ్యులుగా సౌందర్య, రాజేశ్వరి, మహబూబ్‌బాషా, జ్యోతిర్మయి, ఇబ్రహీం, హేమలతలను ఎన్నుకున్నారు. రాష్ట్ర కౌన్సిలర్లుగా జగన్నాథం, శివశంకర్‌లను ఎన్నుకున్నారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్‌, శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాంద్‌ బాషాలు మాట్లాడుతూ విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. పాఠశాలల పర్యవేక్షణ పేరుతో నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన చోట ఉపాధ్యాయులను, ఉన్నతాధికారులను తూలనాడుతూ భయాందోళనకు గురిచేయడం సరికాదని హెచ్చరించారు. సమావేశంలో సీనియర్‌ నాయకులు సుబ్రమణ్యం, త్యాగరాజు, అమర్నాథ్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:18 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising