ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలి: యూటీఎఫ్
ABN, Publish Date - Dec 28 , 2023 | 12:06 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ నాయుడు డిమాండ్ చేశారు.
చిత్తూరు (సెంట్రల్), డిసెంబరు 27: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ నాయుడు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ సంఘం చిత్తూరు డివిజన్ నాయకులు, ఉపాధ్యాయులు బుధవారం డీఈవో కార్యాలయం ముందు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పీఆర్సీ, డీఏ, మెడికల్ రీయింబర్స్‌మెంట్, ఏపీజీఎల్‌ఐ, పీఎఫ్, సరెండర్ లీవు బకాయులు విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బకాయిలు విడుదల చేస్తామని సెప్టెంబరులో చెప్పినా, డిసెంబరు నెల ముగుస్తున్నా, ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడం దురదృష్టకరమన్నారు. బకాయిలు విడుదల చేసేంత వరకు నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, రహనాబేగం, రెడ్డెప్ప, ఎస్పీ బాషా, ఏకాంబరం, సరిత తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2023 | 12:06 AM