చెలరేగిన భూరాబందులు
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:11 AM
రాజీవ్‌నగర్‌లో వైసీపీ నేతలను తరిమికొట్టిన జనం
శ్రీకాళహస్తి డిసెంబరు 17: శ్రీకాళహస్తి పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌లో భూరాబందులు చెలరేగిపోయారు. కడుపు మండిన స్థానికులు తరిమికొట్టడంతో ఇద్దరు వైసీపీ నాయకులు సహా ముగ్గురు పరారయ్యారు.వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాజీవ్‌నగర్‌లో భూకబ్జాదారులు పేదల కోసం కేటాయించిన స్థలాలను అందిన కాడికి మింగేశారు.ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రాత్రికి రాత్రి పాగా వేసేస్తుండడం భరించలేక నిలదీసిన లబ్ధిదారులను దుర్భాషలాడుతున్నారు.ఈ విషయమై స్పందనలో ఫిర్యాదు చేసిన పలువురు లబ్ధిదారులపై దాడులకు సైతం తెగబడ్డారు.ఈ అక్రమాలను భరించలేక 150 కుటుంబాల ప్రజలు రెండు రోజుల క్రితం టీడీపీలో చేరిపోయారు. వైసీపీ భూకబ్జాలతో విరక్తి చెందామని బాహాటంగా ప్రకటించారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామని ఆ పార్టీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో రాజీవ్‌నగర్ కాలనీలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఆదివారం ఇద్దరు వైసీపీ నేతలు సహా ముగ్గురు తిష్ట వేశారు.వీరిలో ఒకరు మాజీ కౌన్సిలర్. వీరేకాకుండా ముక్కంటి పాలకమండలి సభ్యుడైన ఓ నేత యధేచ్ఛగా ఇక్కడ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు న్నాయి.ఓ నిరుపేద స్థలంలో ఏకంగా ఐదంతస్తుల భవనాన్ని నిర్మించడం ఇందుకు నిలువెత్తు నిదర్శనం. భూకబ్జాను ప్రశ్నించినందుకు పలువురిపై దాడి కూడా చేశాడు. కబ్జాలతో రగిలిపోతున్న రాజీవ్‌నగర్‌లో ఆదివారం మళ్లీ సమస్య చెలరేగింది. ముగ్గురు వైసీపీ నేతలు కలిసి ఐదు ఇళ్ల స్థలాలను వాటాలుగా పంచుకున్నారు. ఆ వెంటనే కూలీలతో నిర్మాణ పనులు చేపట్టారు. కడుపు మండిన స్థానికులు,లబ్ధిదారులు వారిలో ఇద్దరిపై తిరగబడటంతో అక్కడినుంచి పారిపోయారు.ఇకనైనా అధికారులు స్పందించి రాజీవ్ నగర్‌లో పేదల స్థలాలను కాపాడాల్సిన అవసరం వుంది.
Updated Date - Dec 18 , 2023 | 12:11 AM