ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటర్లకు డిజిటల్‌ గుర్తింపు కార్డులు

ABN, Publish Date - Dec 22 , 2023 | 12:18 AM

ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ కార్డుల తరహాలోనే ఓటరు కార్డు (ఈ-ఎపిక్‌)ను సైతం డిజిటల్‌ విధానంలో పొందే సదుపాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది.

తపాలాశాఖ ద్వారా అందిస్తున్న డిజిటల్‌ ఓటరు గుర్తింపు కార్డులు

తపాలాశాఖ ద్వారా ఇళ్లకు పంపుతున్న ఎన్నికల సంఘం

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 21: ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ కార్డుల తరహాలోనే ఓటరు కార్డు (ఈ-ఎపిక్‌)ను సైతం డిజిటల్‌ విధానంలో పొందే సదుపాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. 2022 తరువాత నమోదు చేసుకున్న ఓటర్లకు మాత్రమే ఈ అవకాశం ఉండగా, ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలుత డిజిటల్‌ (పీడీఎఫ్‌) విధానంలో డౌన్‌లోడ్‌ చేసుకుని, దాన్ని డిజీలాకర్‌ యాప్‌లో పొందుపరచుకోవడంతో పాటు ప్రింట్‌ తీసుకుని వాడుకునే అవకాశం ఉంది.

పది అంకెలకు కుదింపు

రాష్ట్ర విభజనకు ముందు ఓటరు గుర్తింపు కార్డుపై 14 అంకెల సంఖ్య ఉండేది. ఇప్పటికీ అనేకమంది పాతకార్డులనే వాడుతున్నారు. ప్రస్తుతం జారీ అవుతున్న కార్డుల్లో 10 అంకెలు (తొలి మూడు ఆంగ్ల అక్షరాలు, మిగిలిన ఏడు అంకెలు) ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గానికి ప్రత్యేకంగా మూడు ఆంగ్ల అక్షరాల ప్రత్యేక సిరీస్‌ ఉంటుంది.

డౌన్‌లోడ్‌ ఇలా...

ఫ ఎన్నికల సంఘం నూతనంగా ప్రవేశపెట్టిన గ్ట్ఛౌటట.్ఛఛిజీ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో లేదా సెల్‌ఫోన్‌లో ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని మొబైల్‌ నెంబర్‌తో లాగిన్‌ అవ్వాలి.

ఫ అనంతరం వెబ్‌సైట్‌ తెరపై కనిపించే ఈ-ఎపిక్‌ కార్డు డౌన్‌లోడ్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌చేసి తగిన వివరాలు నమోదు చేసిన తర్వాత మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత ఈ-ఎపిక్‌ కార్డును పీడీఎ్‌ఫరూపంలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీనిని మొబైల్‌లోని డిజిటల్‌ లాకర్‌లో పొందుపరచుకుని, అవసరమైతే ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు.

ఫ కార్డు ముందుభాగంలో ప్రత్యేక చిప్‌తో పాటు వెనుకవైపు క్యూఆర్‌ కోడ్‌ సైతం నూతనంగా వచ్చింది. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఓటరు పూర్తి వివరాలు తెరపై ప్రత్యక్షమవుతాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట నకిలీ ఓటరు గుర్తింపు కార్డులకు అడ్డుకట్ట వేసేందుకు ఎక్కువమంది డిజిటల్‌బాట పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇంటి వద్దకే కార్డులు

నూతన ఓటరుకార్డును తపాలాశాఖ ద్వారా ఇంటికే ఎన్నికల సంఘం పంపిస్తుంది. పాత కార్డులు ఉన్నవారు కూడా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఫారం-8లో మూడో ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని కొత్తకార్డును పొందవచ్చు. జిల్లాకు ఇదివరకే తొలివిడతలో 32వేలు, రెండో విడతగా 18వేలు, మూడో విడతగా 29వేలు కొత్త డిజిటల్‌ ఓటరు కార్డులు రాగా, మరో 80వేల కార్డులు నాలుగో విడతలో రానున్నాయి. దీనిని తొలుత జిల్లా ఎన్నికల సంఘంలోని జిల్లా ఎన్నికల విభాగం స్కాన్‌ చేసిన అనంతరం వాటిని క్రమంగా తపాలా శాఖ ద్వారా నేరుగా రిజిస్టర్‌ పోస్టు ద్వారా ఓటర్లకు అందజేస్తారు.

Updated Date - Dec 22 , 2023 | 12:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising