Tirumala: తిరుమలలో భక్తుల నిరసన..
ABN, First Publish Date - 2023-12-05T10:03:05+05:30
వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులు నిరసనకు దిగారు. టీటీడీ భక్తులకు వడ్డీంచిన అన్నం బాగోలేదంటూ టీటీడీ సిబ్బందిపై మండిపడ్డారు. భక్తులకి ఇలాంటి అన్నం పెడతారంటూ భక్తులు టీటీడీ సిబ్బందిని నిలదీశారు.
తిరుమల : వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులు నిరసనకు దిగారు. టీటీడీ భక్తులకు వడ్డీంచిన అన్నం బాగోలేదంటూ టీటీడీ సిబ్బందిపై మండిపడ్డారు. భక్తులకి ఇలాంటి అన్నం పెడతారంటూ భక్తులు టీటీడీ సిబ్బందిని నిలదీశారు. ఒక్కసారికి క్షమించి వదిలెయ్యమని టీటీడీ సిబ్బంది భక్తులను కోరారు. ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పాలంటూ భక్తులు డిమాండ్ చేశారు. భక్తులకు సర్ది చెప్పి టీటీడీ సిబ్బంది పంపించివేసింది.
Updated Date - 2023-12-05T11:46:39+05:30 IST