ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంగన్వాడీల నిరసన హోరు

ABN, Publish Date - Dec 22 , 2023 | 12:21 AM

అంగన్వాడీల నిరసన హోరెత్తింది. సమ్మెలో భాగంగా గురువారం పలుచోట్ల భిక్షాటన, వంటావార్పు, చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు.

కుప్పంలో చెవులో పువ్వులు పెట్టుకుని నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు

రిలే నిరాహార దీక్ష చేపట్టిన కార్యకర్తలు, సహాయకులు

చిత్తూరు, డిసెంబరు 21: అంగన్వాడీల నిరసన హోరెత్తింది. సమ్మెలో భాగంగా గురువారం పలుచోట్ల భిక్షాటన, వంటావార్పు, చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. చిత్తూరు ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరికి ఎస్టీయూ రాష్ట్ర నేత గంటా మోహన్‌ సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడీ వర్కర్స్‌యూనియన్‌ నేతలు ప్రభావతి, బుజ్జి, అరుణ, సునీత తదితరులు పాల్గొన్నారు. ఫ కుప్పం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్‌వాడీ సిబ్బంది చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ ప్రభుత్వం తలలో పెట్టుకోవాల్సిన పువ్వును చెవిలో పెట్టి ఏమారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ పలమనేరు ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నగరిలోనూ రిలే దీక్షలు నిర్వహించారు. ఫ పుంగనూరు ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ సిబ్బంది రోడ్లపై వెళ్లేవారి వద్ద.. దుకాణదారుల వద్ద భిక్షాటనతో నిరసన తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే భిక్షమెత్తుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తంచేశారు. ఫ కార్వేటినగరం ఎంపీడీవో కార్యాలయం వద్ద అంగన్‌వాడీ వర్కర్లు బైఠాయించి నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను ఆపేది లేదని హెచ్చరించారు.

Updated Date - Dec 22 , 2023 | 12:21 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising