ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొనసాగిన అంగన్‌వాడీ సిబ్బంది సమ్మె

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:44 AM

జిల్లావ్యాప్తంగా ఐదవ రోజైన శనివారం కూడా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె కొనసాగించారు. గూడూరులో తొలుత గ్రావసేవకుల భవనం వద్ద శిబిరంలో ధర్నా నిర్వహించిన అంగన్‌వాడీ సిబ్బంది అనంతరం అక్కడి నుంచీ పాత బస్టాండు, టవర్‌ క్లాక్‌ సెంటర్‌, రైల్వే స్టేషన్‌ రోడ్డు, రైతు బజారు సెంటర్‌ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు.

తిరుపతిలో అంగన్‌వాడీలకు వివిధ పార్టీల మద్దతు

గూడూరు, పుత్తూరుల్లో భిక్షాటన

పలు పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు

తిరుపతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఐదవ రోజైన శనివారం కూడా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె కొనసాగించారు. గూడూరులో తొలుత గ్రావసేవకుల భవనం వద్ద శిబిరంలో ధర్నా నిర్వహించిన అంగన్‌వాడీ సిబ్బంది అనంతరం అక్కడి నుంచీ పాత బస్టాండు, టవర్‌ క్లాక్‌ సెంటర్‌, రైల్వే స్టేషన్‌ రోడ్డు, రైతు బజారు సెంటర్‌ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో భిక్షాటన చేసి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ఆశా వర్కర్లు మద్దతు పలికారు. పుత్తూరులో తహసిల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచీ కళ్ళకు గంతలు కట్టుకుని ఫ్లై ఓవర్‌ వరకూ ర్యాలీ, భిక్షాటన జరిపారు.ఈ సందర్భంగా ఉద్యోగులకు జనసేన నియోజకవర్గ ఇంఛార్జి మహేష్‌ మద్దతు ప్రకటించడంతో పాటు వారికి భోజనాలు సమకూర్చారు.

పలు పార్టీలు, సంఘాల మద్దతు

కోట మండల కేంద్రంలో కళ్ళకు గంతలు కట్టుకుని ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించగా కాంగ్రెస్‌ పార్టీ తరపున మాజీ ఎంపీ చింతా మోహన్‌తో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఐద్వా, సీఐటీయూ, యూటీఎఫ్‌ సంఘాల నేతలు సంఘీభావం ప్రకటించారు. వెంకటగిరిలో ధర్నాకు దిగిన అంగన్‌వాడీ ఉద్యోగులకు యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ మద్దతు ప్రకటించింది. పిచ్చాటూరు మండల కేంద్రంలో ధర్నా చేపట్టిన ఉద్యోగులకు కాంగ్రెస్‌ తరపున మాజీ ఎంపీ చింతా మోహన్‌, టీడీపీ, జనసేన, సీఐటీయూ నేతలు మద్దతు తెలిపారు. కాగా టీడీపీ నేత సతీష్‌ నాయుడు ధర్నా శిబిరంలోని ఉద్యోగులకు రూ. 5 వేల ఆర్థిక సాయం కూడా అందించారు. తిరుపతిలో సీపీఎం, జనసేన, ఆమ్‌ ఆద్మీ, రిపబ్లికన్‌, సీఐటీయూ నాయకులు సంఘీభావం ప్రకటించగా శ్రీకాళహస్తిలో అంగన్‌వాడీ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చకపోతే నిరాహార దీక్షకు సిద్ధమంటూ టీడీపీ ఇంఛార్జి బొజ్జల సుధీర్‌ హెచ్చరించారు.

Updated Date - Dec 17 , 2023 | 01:44 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising