ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:16 PM

చిత్తూరు-పూతలపట్టు రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం సమాచారం అందుకున్న చిత్తూరు ఆర్‌పీఎస్‌ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 17: చిత్తూరు-పూతలపట్టు రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం సమాచారం అందుకున్న చిత్తూరు ఆర్‌పీఎస్‌ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 45-50 సంవత్సరాల వయసు కలిగిన మృతుడి కుడి చేతిపైన నెమలి ఈక బొమ్మ కలిగిన పచ్చబొట్టు ఉంది. తెలుపు-నీలి రంగు నిలువు గీతల చొక్కా, నీలి-నలుపు రంగు గీతల లుంగీ ధరించి ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియరాలేదు. దాంతో మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచారు. మృతుడి పూర్తి వివరాలు తెలిసిన వారు చిత్తూరు రైల్వే ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ 9494228854కు తెలియజేయాలని ఆయన తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Updated Date - Dec 17 , 2023 | 11:16 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising