వచ్చిన మూడూ పుంగనూరుకే
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:22 PM
సఫాయి కర్మచారి పథకం కింద జిల్లాకు మూడు గల్ఫర్లు మంజూరయ్యాయి. ఎవరికి అవసరమనే విషయాన్ని పక్కన పెట్టి ఈ మూడింటిని పుంగనూరుకే కేటాయించారు. ఇటీవల సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసే గల్ఫర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిబంధనలోనే ఉంది. ఈ లెక్కన చిత్తూరు కార్పొరేషన్ కూడా ఉంది. ఇక, ఏ మున్సిపాలిటీకి అవసరం అనేది పట్టించుకోలేదు. ఈ మూడు గల్ఫర్లను పుంగనూరుకు కేటాయించడంతో విమర్శలు వస్తున్నాయి.
చిత్తూరు, డిసెంబరు 18: సఫాయి కర్మచారి పథకం కింద జిల్లాకు మూడు గల్ఫర్లు మంజూరయ్యాయి. ఎవరికి అవసరమనే విషయాన్ని పక్కన పెట్టి ఈ మూడింటిని పుంగనూరుకే కేటాయించారు. ఇటీవల సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసే గల్ఫర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిబంధనలోనే ఉంది. ఈ లెక్కన చిత్తూరు కార్పొరేషన్ కూడా ఉంది. ఇక, ఏ మున్సిపాలిటీకి అవసరం అనేది పట్టించుకోలేదు. ఈ మూడు గల్ఫర్లను పుంగనూరుకు కేటాయించడంతో విమర్శలు వస్తున్నాయి. డాక్యుమెంటేషన్ పూర్తయిన వెంటనే లబ్ధిదారులకు అందజేస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కో గల్ఫర్ ధర రూ.33 లక్షలు. ఐదుగురు సభ్యులున్న (ఎస్సీ) గ్రూపునకు పూర్తి రాయితీతో దీనిని ఇస్తారు.
ఇన్నాళ్లు పట్టించుకోకుండా..
గతంలో నిరుద్యోగులను ఆర్థికంగా పరిపుష్టి చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం వివిధ రకాల యూనిట్లను సబ్సిడీ కింద పంపిణీ చేసేది. దాని కోసం జిల్లా యంత్రాంగం ఏటా యూనిట్ల వారీగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే వాటికనుగుణంగా ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేసేది. అధికారులు బ్యాంకర్లతో మాట్లాడి లబ్ధిదారులకు రుణాలను ఇప్పించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్‌తో పాటు బీసీ, మైనార్టీ, ఎస్టీ కార్పొరేషన్లు కనుమరుగయ్యాయి. టీడీపీ హయాంలో ఇచ్చిన రుణాలను రికవరీ చేసి వాటితోనే ఉద్యోగులు జీతాలను రాసుకునే పరిస్థితి ఏర్పడింది.
ఎన్నికలు సమీపిస్తుండటంతో హడావిడి
ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం హడావిడి మొదలు పెట్టింది. ఎస్సీలకు అన్ని ప్రయోజనాలను చేకూర్చుతామనే సంకేతాల్ని ఇవ్వడానికి పది రోజుల కిందట ఐదు గల్ఫర్లను కలెక్టరేట్‌లో పెట్టారు. నాలుగున్నరేళ్లుగా ఎస్సీలను పట్టించుకోని ప్రభుత్వం ఉన్నట్లుండి ఒక్కోటి రూ.33 లక్షల విలువ చేసే గల్ఫర్లను ఎస్సీలకు పంపిణీ చేస్తున్నామని అంటున్నారు. ఈ ఐదింటిలో మూడు చిత్తూరు జిల్లాకు మంజూరయ్యాయి. చిత్తూరు, కార్పొరేషన్‌తోపాటు కుప్పం, పలమనేరు, పుంగనూరు, నగరి మున్సిపాలిటీలు.. పూతలపట్టు, గంగాధరనెల్లూరు, ఎస్సీ రిజర్వురుడు నియోజకవర్గాలున్నాయి. ఈ ప్రాంతాలను కాదని.. ఒక పుంగనూరుకే మూడింటినీ ఇవ్వడం ఎక్కడి సమన్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఐదులో మిగతా రెండు తిరుపతి జిల్లాలోని నాయుడుపేట, గూడూరుకు మంజూరయ్యాయి.
Updated Date - Dec 18 , 2023 | 11:23 PM