ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యువగళం ముగింపు సభకు ప్రత్యేక రైలు

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:15 PM

యువగళం ముగింపు సభకు చిత్తూరు నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

చిత్తూరు సిటీ, డిసెంబరు 17: యువగళం ముగింపు సభకు చిత్తూరు నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీన విజయనగరం జిల్లాలో నిర్వహించనున్న యువగళం విజయోత్సవ సభ, ఎన్నికల శంఖారావం సభకు జిల్లా నుంచి భారీఎత్తున టీడీపీ శ్రేణులు హాజరు కానున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగా 19వ తేది ఉదయం 11 గంటలకు చిత్తూరు రైల్వేస్టేషన్‌ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందన్నారు. పాకాల రైల్వేస్టేషన్‌కు 11.30 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు రేణిగుంట రైల్వేస్టేషన్‌కు, 20వ తేది ఉదయం 5.40 గంటలకు విజయనగరం చేరుకుంటుందని పేర్కొన్నారు. ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారన్నారు. అలాగే తిరుగు ప్రయాణం 21వ తేది ఉదయం 12.30 గంటలకు విజయనగరం రైల్వేస్టేషన్‌ నుంచి రైలు బయలుదేరుతుందని, మధ్యాహ్నం 2 గంటలకు రేణిగుంట, 4 గంటలకు పాకాల, సాయంత్రం 6 గంటలకు చిత్తూరుకు చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రత్యేక రైలులో వచ్చే వారు వారి వారి నియోజకవర్గ ఇన్‌చార్జులు, మండల పార్టీ అధ్యక్షుల వద్ద తమపేరు, వివరాలు ఇవ్వాలని సూచించారు.

Updated Date - Dec 17 , 2023 | 11:15 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising