చంద్రబాబు కోసం వేయికళ్లతో వేచిన కుప్పం
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:48 PM
చంద్రబాబు రాకకోసం కుప్పం నియోకవర్గ ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేసి మాట్లాడారు. చంద్రబాబు చేయని తప్పునకు జైలుకు వెళ్లడం, అక్కడ అనారోగ్యంపాలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను, ప్రజలను కలచివేసిందన్నారు.
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
కుప్పం, డిసెంబరు 26: చంద్రబాబు రాకకోసం కుప్పం నియోకవర్గ ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేసి మాట్లాడారు. చంద్రబాబు చేయని తప్పునకు జైలుకు వెళ్లడం, అక్కడ అనారోగ్యంపాలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను, ప్రజలను కలచివేసిందన్నారు. సొంత నియోజకవర్గమైన కుప్పం మహిళలైతే తన గ్రామ స్థాయి పర్యటనలో ఆయన గురించి ఆరా తీసి కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు. చంద్రబాబుకు తాము అండగా ఉంటామని వారు ప్రతిన బూనుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో తమ ప్రియతమ నేత పర్యటనను విజయవంతం చేయడానికి నియోకవర్గ ప్రజానీకం కాచుకున్నారన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీతోపాటు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎ్‌స.మునిరత్నం, మున్సిపల్ అధ్యక్షుడు రాజ్‌కుమార్ తదితర నేతలు కలిసి 30వ తేదీన చంద్రబాబు బహిరంగ సభ జరిగే కుప్పం మండలం మల్లానూరులోని ఆర్టీసీ బస్టాండు స్థలాన్ని పరిశీలించారు. గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం బహిరంగ సభా స్థలాలనూ పరిశీలించి ఏర్పాట్లకు రంగం సిద్ధం చేశారు.
చంద్రబాబు పర్యటన ఇలా..
కుప్పంలో ఈనెల 28, 29, 30 తేదీలలో జరిగే చంద్రబాబు పర్యటన వివరాలిలా ఉన్నాయి.
28వ తేది
సాయంత్రం 4.00 గంటలకు: గుడుపల్లె ఆర్టీసీ బస్టాండులో బహిరంగ సభ
6.00: కుప్పం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం.
రాత్రి 8.00: మనోహర్ ఇంటికి వెళ్లి పరామర్శ
రాత్రి 8.45: కుప్పం ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో రాత్రి బస
29వ తేది
ఉదయం 11.50: శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ
మధ్యాహ్నం 3.00: రామకుప్పం పోలీస్ స్టేషన్ సెంటర్‌లో బహిరంగ సభ
సాయంత్రం 5.15: కుప్పంలోని ఎంఎం ఫంక్షన్ హాలులో జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశం
6.15: బీసీఎన్ కన్వెన్షన్ హాలులో టీడీపీ నేతలతో సమావేశం
రాత్రి 8.30: కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, రాత్రి బస
30వ తేది
మధ్యాహ్నం 12.20: పీఈఎస్ సమీపంలోని కురబ భవన్ వద్ద భక్త కనకదాస విగ్రహావిష్కరణ, బహిరంగ సభ.
2.20: కుప్పం పట్టణంలోని అన్నక్యాంటీన్ సందర్శన
2.45: పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో పూజలు
3.30: కుప్పం మసీదులో ప్రార్థనలు, ముస్లింమైనారిటీలతో ముఖాముఖి
సాయంత్రం 4.30: కుప్పం మండలం మల్లానూరు ఆర్టీసీ బస్టాండులో బహిరంగ సభ.
Updated Date - Dec 26 , 2023 | 11:51 PM