కాణిపాక ఆలయానికి త్వరలో బంగారు వాకిలి ఏర్పాటు
ABN, First Publish Date - 2023-12-11T00:37:59+05:30
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అతి త్వరలో బంగారు, వెండి తాపడంతో వాకిళ్లను ఏర్పాటు చేయనున్నారు.
ఐరాల(కాణిపాకం), డిసెంబరు 10: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అతి త్వరలో బంగారు, వెండి తాపడంతో వాకిళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ పునర్నిర్మాణ దాతలైన ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ దాతృత్వం వహించనున్నారు. ఆదివారం వారు కాణిపాకం విచ్చేసి వరసిద్ధుడిని దర్శించుకున్నారు. అనంతరం వారు బంగారు, వెండి వాకిలి పనులను పరిశీలించారు. ప్రధాన ఆలయ అంత్రాలయంలో ఈ వాకిళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో పనులను పూర్తి చేయించి అమర్చనున్నట్లు తెలిపారు. ప్రధాన తూర్పు ద్వారానికి వెండి తాపడం చేయడానికి పనులు చేపట్టాలన్నారు. త్వరలో అన్ని పనులను పూర్తి చేసి బంగారు, వెండి తాపడం వాకిళ్లను ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలియజేశారు.
Updated Date - 2023-12-11T00:38:01+05:30 IST