రెండు రోజుల్లో రూ.4.1కోట్లు ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం
ABN, Publish Date - Dec 26 , 2023 | 02:04 AM
ఏపీఎస్ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది.
తిరుపతి(కొర్లగుంట), డిసెంబరు 25 : ఏపీఎస్ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. వారాంతం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, క్రిస్మస్ సెలవులు కలసి రావడంతో ఆర్టీసీకి ప్రయాణికుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో జిల్లా ప్రజా రవాణా విభాగానికి 4.1కోట్లు ఆదాయం సమకూరింది. ఇందులో సగానికి సగం తిరుపతి-తిరుమల మధ్య నడిచిన బస్సుల ద్వారానే వసూలైంది. జిల్లా వ్యాప్తంగా 900బస్సులు శనివారం 3.45లక్షల కిలోమీటర్లు తిరగగా, ఈపీకే రూ.58, ఓఆర్ 79శాతం, ఆదాయం రూ.2కోట్లు. ఆదివారం 3.37లక్షల కిలోమీటర్లు తిరగగా ఈపీకే రూ.62, ఓఆర్ 85శాతం, ఆదాయం రూ.2.1కోట్లు సమకూరింది. సరాసరి రోజుకు 1.49కోట్లు వస్తుండగా గడిచిన రెండు రోజులు దాన్ని అధిగమించడం విశేషం. దీంతో ఆర్టీసీ యాజమాన్యం తిరుపతి జిల్లా ఆర్టీసీకి రాష్ట్రంలోనే ఫస్ట్‌ర్యాంక్ ప్రకటించింది. సిబ్బందిని ఇన్‌చార్జ్ ఈడీ చెంగల్‌రెడ్డి అభినందించారు.
Updated Date - Dec 26 , 2023 | 07:30 AM