ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘కారుణ్యా’నికి అన్న, అక్కా అర్హులే

ABN, Publish Date - Dec 17 , 2023 | 05:17 AM

అవివాహితుడైన ప్రభు త్వ ఉద్యోగి మృతి చెందితే.. మృతుడి తమ్ముడు, చెల్లెలితో పా టు అన్న, అక్కకు కూడా కారుణ్య నియామకం కింద ఉద్యో గం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

లోకాయుక్త ఆదేశాలతో జీవోలో కీలక సవరణ

కర్నూలు(లీగల్‌), డిసెంబరు 16: అవివాహితుడైన ప్రభు త్వ ఉద్యోగి మృతి చెందితే.. మృతుడి తమ్ముడు, చెల్లెలితో పా టు అన్న, అక్కకు కూడా కారుణ్య నియామకం కింద ఉద్యో గం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు జీవో 612లో కీలక సవరణలు చేసి.. కొత్తగా జీవో 18 జారీ చేసింది. వివరాలివీ.. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శరబన్నపాలేనికి చెందిన ఎస్‌.మహేష్‌ అనే వ్యక్తి గ్రేహౌండ్స్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ 2022లో మృతి చెందారు. మృతు డు అవివాహితుడు కావడంతో కారుణ్య నియామకం కింద అతడి అన్న ఎస్‌.అప్పలరాజుకు ఉద్యోగం కోరుతూ తల్లి ఎస్‌.కాంతమ్మ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే నిబంధనల మేరకు తమ్ముడికే అర్హత ఉంటుందని, అన్న అర్హుడు కాదని ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో మృతుడి తల్లి రాష్ట్ర లోకాయుక్తను ఆశ్రయించింది. కేసును విచారించిన రాష్ట్ర లోకాయుక్త జస్టిస్‌ పి.లక్ష్మణ రెడ్డి.. కారుణ్య నియామకానికి మృతుని అన్న అర్హుడు కాదనే నిబంధన సహజ సూత్రాలకి వ్యతిరేకమని, ఫిర్యాది అభ్యర్థనలను పరిశీలించాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం జీవో18ని జారీ చేసింది. దీనిని అనుసరించి మృతుడి అన్నకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినట్లు విశాఖ కలెక్టర్‌ ద్వారా లోకాయుక్తకు తెలియజేసింది.

Updated Date - Dec 17 , 2023 | 05:17 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising