భీమవరంలోని ఓ ఇంట్లో దొంగల హల్‌చల్..
ABN, First Publish Date - 2023-09-22T18:20:53+05:30
భీమవరం నరసయ్య అగ్రహారంలో ఒక ఇంట్లో చోరీ జరిగింది.
పశ్చిమగోదావరి: భీమవరం నరసయ్య అగ్రహారంలో ఒక ఇంట్లో చోరీ జరిగింది. ఒక లక్ష నగదు, 5 కాసుల బంగారం, విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఇంటి యజమాని సెల్వన్(62) కంటి ఆపరేషన్ కోసం వేరొక ఊరు వెళ్లడంతో అదును చూచి దొంగలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఆధారాలు లేకుండా దొంగలు కారం చల్లారని, సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ పోలీసులు పేర్కొన్నారు.
Updated Date - 2023-09-22T18:23:01+05:30 IST