ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

త్వరలోనే జనంలోకి బాబు!

ABN, First Publish Date - 2023-11-28T03:07:14+05:30

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు త్వరలోనే ప్రజల్లోకి రానున్నారు.

ఎల్లుండి తిరుమలకు.. 1న శ్రీవారి దర్శనం

తర్వాత దుర్గమ్మ, అప్పన్న, మల్లన్న దర్శనాలకూ..

అనంతరం పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమాల్లోకి

మూడు ప్రాంతాల్లో 3 భారీ బహిరంగ సభలు!

అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు త్వరలోనే ప్రజల్లోకి రానున్నారు. డిసెంబరు మొదటి వారం నుంచి ఆయన రాజకీయ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కంటి శస్త్ర చికిత్స తర్వాత కొన్ని రోజులుగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని రోజులు కంట్లో దుమ్ము పడకుండా జాగ్రత్త పడాలని వైద్యులు సూచించడంతో ఇంటికే పరిమితమయ్యారు. అయినా కొన్ని నియోజకవర్గాల నేతలను పిలిపించుకుని విడివిడిగా మాట్లాడుతున్నారు. కంటి చికిత్స తర్వాత మొదటిసారి సోమవారం ఆయన బయటకు వచ్చి ఢిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొనే నిమిత్తం తన సతీమణితో కలిసి వెళ్లారు. ఈ నెల 30వ తేదీన ఆయన తిరుమల వెళ్తున్నారు. ఆ రాత్రి అక్కడే బస చేసి ఒకటో తేదీ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. వాస్తవానికి మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి బయటకు రాగానే మొదట తిరుమలకే వెళ్లాలని ఆయన అనుకున్నారు. కానీ అనారోగ్య సమస్యలు ఉండడంతో వైద్యుల సూచనతో హైదరాబాద్‌ వెళ్లారు. అవన్నీ సర్దుకోవడంతో ఇప్పుడు తిరుమల వెళ్తున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత అదే రోజు విమానంలో అమరావతి వస్తారు. తర్వాతి రోజుల్లో బెజవాడ దుర్గమ్మ, సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్ననూ దర్శించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఆ తర్వాత నుంచి పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొని వేగం పెంచుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఆయన మూడు బహిరంగ సభలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని నాయకత్వం యోచిస్తోంది. లోకేశ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఉత్తరాంధ్రలో డిసెంబరులో భారీ బహిరంగ సభ ఉంటుంది. అందువల్ల ఉత్తరాంధ్రను మినహాయించి మిగిలిన రెండు ప్రాంతాల్లో రెండు సభలు నిర్వహించే అవకాశం ఉంది.

ఢిల్లీలో చంద్రబాబు దంపతులు

న్యూఢిల్లీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి సోమవారం ఢిల్లీ వెళ్లారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని, రామ్మోహన్‌నాయుడు, రఘురామకృష్ణంరాజు, మాజీ మంత్రి నారాయణ తదితరులు స్వాగతం పలికారు. సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుని వివాహ రిసెప్షెన్‌కు చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

Updated Date - 2023-11-28T03:07:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising