ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Assembly : అసెంబ్లీ ప్రారంభమైన క్షణాల్లోనే వాయిదా..

ABN, First Publish Date - 2023-09-22T10:00:58+05:30

ఏపీ అసెంబ్లీ ప్రారంభమయ్యీ అవగానే టీడీపీ ఆందోళనకు దిగింది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దరిద్రపు పాలన పోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

అమరావతి : ఏపీ అసెంబ్లీ ప్రారంభమయ్యీ అవగానే టీడీపీ ఆందోళనకు దిగింది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దరిద్రపు పాలన పోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. మంత్రి అంబటి రాంబాబు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం జగన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాము వూరుకోబోమని అంబటి హెచ్చరించారు. ఇది టీడీపీ ఆఫీస్ కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు. అయినా కూడా టీడీపీ సభ్యులు తగ్గలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు కొనసాగిస్తున్నారు. ప్లకార్డులను వారి వద్ద నుంచి తీసుకోవాలని స్పీకర్‌ను మంత్రి జోగి రమేష్ కోరారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలు చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. సైకో పాలన పోవాలని నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల నినాదాలు మధ్య.. అసెంబ్లీ ప్రారంభమైన క్షణాల్లోనే అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు.

Updated Date - 2023-09-22T10:00:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising