Swamy Srinivasananda: జగన్‌ను బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం
ABN, First Publish Date - 2023-05-10T13:02:39+05:30
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి AP Sadhu Parishad President Swami Srinivasananda Saraswati) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... చర్చిలో ఫాదర్‌లకు జీతాలు ఇస్తున్న ప్రభుత్వం సాధువులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. హిందు దేవాలయాలను రక్షించి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి గద్దె దించి హిందూ ధర్మాన్ని కాపాడి హిందూ ధర్మాన్ని ప్రచారం చేసి మరింత ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఓటు ద్వారా జగన్‌కు బుద్ధి చెప్పడానికి హిందువులందరం సిద్ధంగా ఉన్నట్లు స్వామీజీ తెలిపారు.
జగన్ మోహన్ రెడ్డి అనే పేరు హిందూ పేరా, ముస్లిం పేరా, క్రిస్టియన్ పేరా.. అతని పేరు ద్వారా అతను హిందువు అని తెలుస్తుందన్నారు. హిందువులందరూ తిరుగుబాటు చేయకపోతే రానున్న రోజుల్లో దేవాలయాలు ఉండవని.. హిందూ మతం ఉండదని తెలిపారు. హిందూమతాన్ని నిర్వీర్యం చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని... జగన్ కుతంత్రాలు తిప్పి కొట్టే ప్రయత్నాన్ని సాధువులందరం చేయనున్నట్లు చెప్పారు. హిందూ మతాన్ని కాపాడుకునే దిశగా వైజాగ్, తిరుపతి, కొన్ని ప్రాంతాలలో ధార్మిక సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్య పరుస్తామన్నారు. ఉప్పెన లాగా బంగాళాఖాతంలో జగన్‌మోహన్ రెడ్డిని హిందువులందరూ కలిపేయడం ఖాయమని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-05-10T15:06:04+05:30 IST