ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాన్ని ముంచేసింది వైసీపీ, బీజేపీలే

ABN, First Publish Date - 2023-03-31T03:55:53+05:30

రాజధానిని చిన్నాభిన్నం చేసి అమరావతి ప్రజలను నట్టేట ముంచిన పాపం వైసీపీ, బీజేపీలదేనని సీపీఎం విమర్శించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పథకం ప్రకారమే అమరావతిని నీరుగార్చారు

రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు

ఇక నుంచి ఉమ్మడి ఉద్యమంలోనూ భాగస్వాములమే

అమరావతి రైతులకు సీపీఎం బహిరంగ లేఖ

అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): రాజధానిని చిన్నాభిన్నం చేసి అమరావతి ప్రజలను నట్టేట ముంచిన పాపం వైసీపీ, బీజేపీలదేనని సీపీఎం విమర్శించింది. అమరావతి రైతులు, ప్రజలు చేస్తున్న ఉద్యమం 1,200 రోజులకు చేరుకున్న సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు గురువారం బహిరంగ లేఖ రాశారు. ‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు, ప్రతిపక్ష నేతగా రాష్ట్ర రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేసే అంశంపై శాసనసభలోనే పూర్తి మద్దతు తెలిపారు. తర్వాత కూడా రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని, మరింత మెరుగైన రీతిలో అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అనంతరం మాట తప్పి మూడు రాజధానుల పేరుతో వివాదాన్ని లేపారు. వికేంద్రీకరణ సాకుతో రాజధానిని చిన్నాభిన్నం చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతి విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోంది. ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రధాని మోదీ పూర్తిగా విస్మరించి నమ్మక ద్రోహం చేశారు. అందుకే బీజేపీ కపట వైఖరిని తొలి నుంచే ఎండగడుతూ వచ్చిన సీపీఎం ఆ పార్టీతో కలిసి వేదిక పంచుకోవడానికి నిరాకరించింది. బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు పథకం ప్రకారం అమరావతిని నీరుగారుస్తూ వచ్చాయి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని ఎన్నికల ముందు సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. రాజధాని ప్రజలకు, రైతులకు పూలింగ్‌ చట్ట ప్రకారం ఇచ్చిన హామీలను అమలు చేయాలని 1200 రోజులుగా కొనసాగిస్తున్న ఉద్యమానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. ఇక నుంచి ఉమ్మడి ఉద్యమంలోనూ భాగస్వామి అవుతుంది’’ అని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ట్రూ అప్‌ చార్జీలను ఉపసంహరించుకోవాలి

విద్యుత్తు ట్రూ అప్‌ చార్జీలను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చార్జీలు పెంచలేదని ఒకవైపు నోటిఫికేషన్‌ జారీ చేస్తూ.. మరోవైపు సర్దుబాటు చార్జీల పేరుతో దొడ్డిదారిన భారాలు వేయడం సర్కారు మోసపూరిత వైఖరిని తెలియజేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2023 ఏప్రిల్‌ నుంచి రాష్ట్రంలో ప్రతినెల విద్యుత్తు యూనిట్‌కు 40 పైసల చొప్పున అదనంగా సర్దుబాటు చార్జీలు వసూలు చేస్తుండటాన్ని సీపీఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన తెలిపారు.

Updated Date - 2023-03-31T03:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising