ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Jagan: ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం

ABN, First Publish Date - 2023-06-23T13:27:20+05:30

తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ‘‘జగనన్న సురక్ష’’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతంలో ఏ పని కావాలన్నా గవర్నమెంట్ ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సి వచ్చేదని.. ఈ ప్రభుత్వం వచ్చాక పారదర్శకంగా పౌర సేవలు అందిస్తున్నామన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో ‘‘జగనన్న సురక్ష’’ కార్యక్రమం మొదలైంది. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ‘‘జగనన్న సురక్ష’’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతంలో ఏ పని కావాలన్నా గవర్నమెంట్ ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సి వచ్చేదని.. ఈ ప్రభుత్వం వచ్చాక పారదర్శకంగా పౌర సేవలు అందిస్తున్నామన్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలకు అజెండా లేకుండా చేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లంచం లేకుండా పథకాలు గ్రామ స్థాయిలో అందిస్తున్నామని తెలిపారు. నవరత్నాల ద్వారా నాలుగేళ్లలో 2 లక్షల 16 వేల కోట్లు అందించామని చెప్పారు. వీటితో పాటు ఇతర సంక్షేమ పధకాలు అందించామన్నారు. అర్హులు ఎవ్వరూ మిగిలి పోకుండా ఉండేందుకు 6 నెలలకు ఒక సారి అవకాశం ఇచ్చామని తెలిపారు. అలాగే జగన్నన్నకు చెబుదాం అని తన దృష్టికి తీసుకురావాలని చెప్పామన్నారు. ఇంకా ఎవ్వరైనా మిగిలి పోయినా వారికి ప్రభుత్వ లబ్ధి కోసం జగనన్న సురక్ష తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ పథకం కింద వివిధ రకాల సర్టిఫికెట్లను అందజేస్తామన్నారు. 11 రకాల సేవలు ఎలాంటి సర్వీస్ చార్జి లేకుండా అందచేస్తున్నమని తెలిపారు. రాష్ట్రంలోని కోటి 60 లక్షల ఇళ్లకు వెళ్లి లబ్ది అందని వారికి సురక్ష ద్వారా అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు.

Updated Date - 2023-06-23T13:27:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising