Mangalagiri: వైసీపీకి మరో కీలక నేత రాజీనామా..
ABN, Publish Date - Dec 23 , 2023 | 01:53 PM
మంగళగిరిలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మరో కీలక నేత రాజీనామా చేశారు. ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంకా బాలాజీ గుప్తా వైసీపీకి రాజీనామా చేశారు. మంగళగిరి మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా బాలాజీ గుప్తా పని చేశారు. ఆయన టీడీపీలో చేరనున్నట్టు సమాచారం. మంగళగిరిలో వైసీపీకి రాజీనామా చేసే యోచనలో మరికొందరు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.
గుంటూరు : మంగళగిరిలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మరో కీలక నేత రాజీనామా చేశారు. ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంకా బాలాజీ గుప్తా వైసీపీకి రాజీనామా చేశారు. మంగళగిరి మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా బాలాజీ గుప్తా పని చేశారు. ఆయన టీడీపీలో చేరనున్నట్టు సమాచారం. మంగళగిరిలో వైసీపీకి రాజీనామా చేసే యోచనలో మరికొందరు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేసిన దగ్గర నుంచి పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఒకవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరింత యాక్టివ్ అవడంతో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ బాగా బలపడింది. ఇలాంటి తరుణంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా బాట పట్టడంతో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. ఉన్న వైసీపీలో గ్రూపులు బాగా పెరిగాయి. ఈ సారి మంగళగిరిలో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందన్న ఊహాగానాల నడుమ ఆ పార్టీ నేతలంతా రాజీనామాల బాట పడుతున్నట్టు సమాచారం.
Updated Date - Dec 23 , 2023 | 01:53 PM