ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అభివృద్ధిపై వైసీపీ వ్యాఖ్యలు హాస్యాస్పదం

ABN, Publish Date - Dec 14 , 2023 | 12:58 AM

ధర్మవరం, డిసెంబరు 13: నియోజకవర్గంలో అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోందని వైసీపీ వారు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

ధర్మవరం, డిసెంబరు 13: నియోజకవర్గంలో అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోందని వైసీపీ వారు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుఽధవారం సాయంత్రం నాయకులు కమతం కాటమయ్య , ఫణికుమార్‌,పరిశేసుధాకర్‌, నాగూర్‌హుస్సేన, పురుషోత్తంగౌడ్‌, అంబటిసనత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కదిరి గేటు రైల్వే ఉపరితల వంతెన నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న బాధిత కుటుంబాలు ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాలశ్రీరామ్‌ను కలిసి తమకు ఎక్‌గ్రేషియా ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని, న్యాయం చేయాలని కోరారని, పరిటాలశ్రీరామ్‌ వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న 138 కుటుంబాల్లో దాదాపు 35 మంది హైకోర్టు స్టే తెచ్చుకున్నారని, మిగిలిన వారిలోదాదాపు 50 మందికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారని, ఇంకా మిగిలిన వారికి కూడా నష్టపరిహారం చెల్లించిన తరువాతే ఇళ్లు తొలగింపు చేపట్టాలని పరిటాలశ్రీరామ్‌ అధికారులను కోరారని, అంతేగానీ అభివృద్ధిని ఎక్కడా అడ్డుకోలేదని వారు చెప్పారు. వైసీపీ నేతలేఉ పచ్చనిచెట్లను నరకడం, భూకబ్జాలకు పాల్పడటం, ఇళ్లను కూల్చడం వంటివి చేస్తూ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాళ్లపల్లిషరీప్‌, మాధవరెడ్డి, కత్తులబాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 12:58 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising