వీఆర్‌ఏల సమస్యలు పట్టని వైసీపీ
ABN, Publish Date - Dec 28 , 2023 | 11:49 PM
గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను ప్రభుత్వం విస్మరించిందని ఆ సంఘం నాయకులు మండిపడ్డారు.
అనంతపురంరూరల్, డిసెంబరు 28: గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను ప్రభుత్వం విస్మరించిందని ఆ సంఘం నాయకులు మండిపడ్డారు. ఆ మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆ సంఘం గౌరవా ధ్యక్షుడు వెంకటనారాయణ, అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, సుబ్రమణ్యం మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలకు సంబంధించిన భూ సమస్యల పరిష్కరంలో వీఆర్‌ఏలు ముఖ్యపాత్ర పోషిస్తున్నారన్నారు. నిత్యం గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలం దిస్తున్నారన్నారు. వీఆర్‌ఏలకు పేస్కేలు అమలు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న వీఆర్‌ఓ పోస్టులను వీఆర్‌ఏతో భర్తీ చేయాలన్నారు. అనంతరం డీఆర్‌ఓ గాయత్రి దేవికి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ స్వామి, తిప్పేస్వామి, వీరన్న, నాగరాజు, వన్నూరు స్వామి పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2023 | 11:49 PM