మహిళ ఆత్మహత్య
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:50 PM
మండలంలోని దేవరపల్లి గ్రామంలో ఆదివారం రామాంజనమ్మ(40) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
పామిడి, డిసెంబరు 17: మండలంలోని దేవరపల్లి గ్రామంలో ఆదివారం రామాంజనమ్మ(40) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... దేవరపల్లి గ్రామానికి చెందిన గిరయ్య, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె రామాంజనమ్మను 20 సంవత్సరాల క్రితం కడప జిల్లా రైల్వే కొండాపురం గ్రామానికి చెందిన శ్రీరాములుకు ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలంగా తలనొప్పి, ఇతర అనారోగ్య కారణాలతో ఈమె బాధపడుతోందన్నారు. శనివారం సాయంత్రం పుట్టినిల్లు దేవరపల్లికి వచ్చిందన్నారు. అనారోగ్య సమస్యలు తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నారు. వ్యవసాయ కూలి పనుల నుంచి వచ్చి చూసే సరికి ఉరికి వేలాడుతున్న కుతురిని చూసి తల్లి లక్ష్మిదేవి విలవిలలాడిందన్నారు. స్థానికులు హుటాహుటిన పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారన్నారు. మృతురాలికి భర్త శ్రీరాములుతో పాటు కుమార్తెలు ఆదిలక్ష్మి, అశ్వణి, కుమారుడు మల్లేష్ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Dec 17 , 2023 | 11:51 PM