ఎమ్మెల్యేగా గ్రామంలోకి అడుగుపెడతా
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:48 PM
ప్రస్తుతం మీ గ్రామానికి వచ్చి సమస్యలు తెలుసుకున్న నాలుగు నెలల తరువాత ఎమ్మేల్యేగా అడుగుపెట్టి మీ సమస్యలు పరిష్కరిస్తానని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు.
టీడీపీ ధర్మవరం ఇనచార్జి పరిటాల శ్రీరామ్
బత్తలపల్లి, డిసెంబర్ 17: ప్రస్తుతం మీ గ్రామానికి వచ్చి సమస్యలు తెలుసుకున్న నాలుగు నెలల తరువాత ఎమ్మేల్యేగా అడుగుపెట్టి మీ సమస్యలు పరిష్కరిస్తానని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. మండలంలోని జ్వాలాపురం గ్రామంలో ఆయన ఆదివారం పర్యటించారు. గ్రామమునికి చెందిన గంజే పోతలయ్య, శివయ్య, రామక్రిష్ణ, తిరుపాలు, రామన్న, బ్యాళ్ల మల్లికార్జున కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చెరారు. శ్రీరామ్ మాట్లాడుతూ ధర్మవరంలో టీడీపీ గెలుపు ఎప్పుడో నిశ్చయమైందన్నారు. అందుకే వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరుతున్నారని అన్నారు. కొత్తగా వచ్చిన వారితో సమష్టిగా కలిసి పని చెయలని సూచించారు. గ్రామంలో నేలకొన్న సమస్యలను ప్రజలు శ్రీరామ్ దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు అరెస్టు తరువాత టీడీపీ బలహీన పడుతుందని జగనరెడ్డి భావించారని, కాని రెట్టంపు ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. అంగనవాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళనలు చేస్తుంటే, ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకుండా సచివాలయ ఉద్యోగులతో సెంటర్లు నిర్వహిచడం దారుణమన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్‌మార్నింగ్ చేస్తుంటే వైసీపీ నాయకులు నాలుగు నెలల ముందే ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారన్నారు. చల్లా శ్రీనివాసులు, గోనుగుంట్ల నారాయణరెడ్డి, తాళ్లూరి సతీష్, సరేంద్ర, కేశవరెడ్డి, రవి, చితంబర్‌రెడ్డి, నారాయణస్వామి, కిష్టయ్య, మందల శ్రీనివాసులు, కిష్ట పాల్గొన్నారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక
కొత్తచెరువు: మండలంలోని గౌనుకుంటపల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని బైరాపురం సర్పంచ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు. గౌనికుంటపల్లిలో ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ నాయకులు సోమశేఖర్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి, భాస్కర్‌రెడ్డి, హర్షవర్దనరెడ్డి, రాజారెడ్డి, తేజారెడ్డి, శ్రీనివాసులు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. వారికి పల్లె కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం పల్లె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మునిగిపోయే నావ లాంటిదని అందుకనే టీడీపీలోకి చేరికలు మొదలయ్యాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఎక్కడ చూసిన అభివృద్ధి లేక ప్రజలు, నిరుద్యోగులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు సంపదను సృష్టించే నాయకుడని జగన సంపదను కొల్లగొట్టేనాయకుడన్నారు. వచ్చేది టీడీపీనేని అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. సాలక్కగారి శ్రీనివాసులు, మండల కన్వీనర్ అడపాల రామకృష్ణ, పట్టణ కన్వీనర్ ఒలిపి శీన, లక్ష్మీనారాయణ, ఓబుళరెడ్డి, శంకరప్ప, బండ్లపల్లిరాజు, సుధాకర్, వెంకటేశ, లోచర్లబాబు, నారాయణస్వామి, డ్రైవర్ కేశప్ప పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 11:48 PM