జీతాలెప్పుడు?.. జగనన్నా!
ABN, First Publish Date - 2023-12-10T23:48:13+05:30
ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రతి నెలా ఒకటోతేదీ నాడు జీతం అందుకునేవారు. కాని ప్రస్తుతం వారు తమ ఖాతాల్లో ఎపుడు జీతాలు జమ అవుతాయోనని ఎదురు చూడాల్సి వస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఉండేదికాదు. అపుడు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నా, ఠంచనగా ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేవారు. ఇపుడు అందుకు విరుద్దంగా జీతం ఎప్పుడు పడుతుందో తెలియని దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
పదోతేదీ దాటినా పడని వేతనాలు
ప్రతినెలా ఎదురుచూపులే
ఉద్యోగ, ఉపాధ్యాయులకు
తప్పని తిప్పలు
కనికరించని ప్రభుత్వం
మండిపడుతున్న
ఉద్యోగవర్గాలుఅనంతపురం టౌన, డిసెంబరు10: ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రతి నెలా ఒకటోతేదీ నాడు జీతం అందుకునేవారు. కాని ప్రస్తుతం వారు తమ ఖాతాల్లో ఎపుడు జీతాలు జమ అవుతాయోనని ఎదురు చూడాల్సి వస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఉండేదికాదు. అపుడు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నా, ఠంచనగా ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేవారు. ఇపుడు అందుకు విరుద్దంగా జీతం ఎప్పుడు పడుతుందో తెలియని దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
నవంబరునెల జీతాలు డిసెంబరు ఒకటోతేదీన పడాల్సి ఉంది. పదోతేదీవచ్చినా ఇప్పటికీ జిల్లాలో వేలాదిమంది ఉద్యోగ ఉపాద్యాయులకు జీతాలు అందలేదు. ఒకటోతేదీన పడాల్సిన జీతాలు 5వతేదీనుంచి పడ్డాయి, ఇక్కడకూడా అందరికీ జీతాలు రాలేదు. అధికారికలెక్కలప్రకారం అనంతజిల్లాలో దాదాపు 40వేలమంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో 12వేలమందివరకు ప్రభుత్వ, జిల్లాపరిషత, మున్సిపల్, మోడల్‌స్కూల్స్ ఉపాధ్యాయులు ఉన్నారు. మిగిలిన ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు అందలేదు.
ఫ ఉపాధ్యాయుల
జీతాలపై మరీ చిన్నచూపు
ఏడాదిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒకటో తేదీ జీతం అనేది ఓ కలగా మారిపోయింది. అందులోనూ ఉపాధ్యాయుల జీతాలపై మరీ చిన్నచూపు ఏర్పడింది. జీతాలు ఆలస్యంగా వేస్తే తొలుత రెవెన్యూ, హెల్త్, పోలీస్, సచివాలయాల వారికి వేస్తున్నారు. ఆ తర్వాత ఉపాధ్యాయులు, ఇతరశాఖల వారికి ఇస్తున్నారు. ఈనెల ఇప్పటికీ 60శాతం మంది ఉపాధ్యాయులకు, ఇరిగేషన, గ్రంథాలయం, వివిధ శాఖల ఉద్యోగులకు జీతాలు రాలేదని చెబుతున్నారు. జీతంపై ఆధారపడి బ్రతికే ఉద్యోగులు సకాలంతో జీతాలు అందక అనేక అవస్థలు పడుతున్నారు. ఇంటి ఖర్చులు, అద్దెలు, బ్యాంకు ఈఎంఐలు సకాలంలో కట్టలేక నానా ఇబ్బందులు పడాల్సివస్తోంది. సకాలంతో వేతనాలు ఇవ్వాలని సీఎ్‌ఫఎంఎ్‌సను తీసుకొచ్చారు. డీడీఓలు ప్రతినెల జీతాల బిల్లులు పెడుతున్నా, ప్రభుత్వం దగ్గర డబ్బులులేక ఖాతాల్లో డబ్బులు మాత్రం పడడంలేదు, ట్రెజరీశాఖ అధికారులు సైతం బిల్లులు పార్వర్డ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఎంపీలు, ఎంఎల్‌ఏలకు నెలనెలా ఠంచనగా వేతనాలు ఇస్తూ ఉద్యోగుల విషయంలో నిర్లక్ష్యం చేయడంపట్ల ఉద్యోగవర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.
Updated Date - 2023-12-10T23:48:14+05:30 IST