ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రాజెక్టుల హామీ ఏమైంది..?

ABN, First Publish Date - 2023-12-10T23:38:14+05:30

‘ రాప్తాడు నియోజకవర్గంలో నాలుగు ప్రాజెక్టులు ఏర్పాటు చేసి సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చావ్‌. వాటి నిర్మాణాలకు శంకుస్థాపన చేసి ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకూ కనీసం ఎకరం కూడా సేకరించలేదు. ఉత్త మాటలే తప్పా... చేసిందేమీ లేదు. నీవోక అసమర్థ ఎమ్మెల్యేవి..’ అని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు.

రాంపురంలో ప్రచారం చేస్తున్న పరిటాల సునీత

ధర్మవరం రూరల్‌, డిసెంబరు 10: ‘ రాప్తాడు నియోజకవర్గంలో నాలుగు ప్రాజెక్టులు ఏర్పాటు చేసి సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చావ్‌. వాటి నిర్మాణాలకు శంకుస్థాపన చేసి ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకూ కనీసం ఎకరం కూడా సేకరించలేదు. ఉత్త మాటలే తప్పా... చేసిందేమీ లేదు. నీవోక అసమర్థ ఎమ్మెల్యేవి..’ అని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. కనగానపల్లి మండలం రాం పురం గ్రామంలో ఆదివారం నిర్వహించిన బాబు ఘ్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. టీడీపీ హయాంలో జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి పేరూరుకు హంద్రీనీవా నీరు అందించేందుకు నిధులు కేటాయించామన్నారు. ఈ క్రమంలో పుట్టకనుమ సోమరవాండ్లపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలకు చర్యలు చేపట్టామన్నారు. అయితే వైసీపీ అధికాంలోకి వచ్చాక పుట్టకనుమ రద్దు చేసి ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నా.. కనీసం భూ సేకరణ కూడా చేయలేదని విమర్శించారు. నాలుగున్నర ఏళ్లలో రాప్తాడులో జరిగిన ప్రాజెక్టు నిర్మాణలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.

Updated Date - 2023-12-10T23:38:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising