పెళ్లింట విషాదం
ABN, Publish Date - Dec 30 , 2023 | 11:54 PM
పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబసభ్యులతో కళకళలాడుతున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా తీవ్ర విషాదం అలుముకుంది. రోడ్డు ప్రమాదంలో పెళ్లికుమార్తె తండ్రి మృతి చెందడంతో కుటుంబసభ్యులు దుఖఃసాగరంలో మునిగిపోయారు.
ఫ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బొలెరో ఫ పెళ్లి
కుమార్తె తండ్రి దుర్మరణంఫ ఇద్దరికి గాయాలుదెబ్బతిన్న ద్విచక్ర వాహనం
ఆంజనేయులు(ఫైల్)చెన్నేకొత్తపల్లి, డిసెంబరు 30: పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబసభ్యులతో కళకళలాడుతున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా తీవ్ర విషాదం అలుముకుంది. రోడ్డు ప్రమాదంలో పెళ్లికుమార్తె తండ్రి మృతి చెందడంతో కుటుంబసభ్యులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రామగిరి మండలం గంతిమర్రికి చెందిన ఎం.ఆంజనేయులు (47) ద్విచక్రవాహనంలో ఎనఎ్‌సగేటు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. అయితే ఎనఎ్‌సగేటు దాటి కొంత దూరం వెళ్లగానే బొలెరో వ్యాన ఎదురుగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొని రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు అక్కడిక్కడే మృతిచెందాడు. బొలెరో వాహనంలో ఉన్న ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వాహన డ్రైవర్ పరారయ్యా డు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పెళ్లింట తీవ్ర విషాదం: గంతిమర్రికి చెందిన ఆంజనేయులు పెద్ద కుమార్తె శ్రుతికి ఈనెల 28న వివాహమైంది. నంద్యాల జిల్లా ప్యాపిలిలో వివాహం జరిగింది. శుక్రవారం రాత్రి స్వగ్రామంలో తన ఇంటిలో తిరిగింపు లు ఘనంగా జరిపించాడు. అయితే కొన్నిగంటల్లోనే రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించడంతో ఆ పెళ్లింట విషాదం నెలకొంది. నాన్న నా పెళ్లి చేసి వెళ్లిపోతివా... అంటూ శ్రుతి బోరున విలపించడం చూసిన పలువురు చలించిపోయారు.
Updated Date - Dec 30 , 2023 | 11:54 PM