విజయసాయిరెడ్డీ.. నోరు అదుపులో పెట్టుకో..
ABN, First Publish Date - 2023-10-30T00:17:26+05:30
వైసీపీ ఎంపీ విజయ్‌సాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ తెలిపారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్
పెనుకొండ రూరల్, అక్టోబరు 29 : వైసీపీ ఎంపీ విజయ్‌సాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ తెలిపారు. ఆయన ఆదివారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకు లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం శేఖర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో వైసీపీ నాయకులు అధికార దురహం కారంతో పెట్రే గిపోతున్నారన్నారు. మద్యం కుంభకోణంలో జరిగిన అవినీతి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఆధారాలతో మాట్లా డితే, ఆమెపై అవాకులు చవాకులు పేలడం వైసీపీ ఎంపీకి తగదన్నారు. అవినీతి ఆరోపణల కేసులు ఎదుర్కొని, బెయిల్‌పై తిరుగుతున్న ఎంపీ విజ య్‌సాయిరెడ్డికి పురందేశ్వరి గురించి మాట్లాడే అర్హత లేదని ఎద్దేవ చేశారు. నాయకులు ఎనుమల రామక్రిష్ణ, నాయకులు రామాంజనేయులు, శ్రీరాము లు, ముత్యాలమ్మ, రవి, సుభద్రమ్మ, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-30T00:17:26+05:30 IST