ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ఆలయం

ABN, Publish Date - Dec 22 , 2023 | 12:18 AM

స్థానిక లక్ష్మీ వెంకటరమణస్వామి దేవాలయాన్ని శనివారం వైకుంఠ ఏకాదశి(ముక్కోటి ఏకాదశి) సంద ర్భంగా ముస్తాబు చేశారు.

ముస్తాబైన లక్ష్మీ వెంకటరమణస్వామి ఆలయం

పెనుకొండ, డిసెంబరు 21 : స్థానిక లక్ష్మీ వెంకటరమణస్వామి దేవాలయాన్ని శనివారం వైకుంఠ ఏకాదశి(ముక్కోటి ఏకాదశి) సంద ర్భంగా ముస్తాబు చేశారు. ఆలయంలో భక్తులకు ఉత్తర ద్వార ప్రవేశా నికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆలయ కమిటీ వారు తెలిపారు. ఆలయాన్ని విద్యుత దీపాలతో అలంకరించారు. ఏకాదశి సందర్భంగా ఉదయం అర్చకులు రమేష్‌స్వామి ఆధ్వర్యంలో వివిధ పూజా కార్యక్రమా లు, ఉదయం 7.30నుంచి స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. ఈ యేడాది ఆలయంలో శ్రీవారి తులాభారం ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులందరూ తరలి రావాలని కోరారు. అలాగే తో టగేరి లో వెలసిన నగరేశ్వర స్వామి దేవాలయంలోని జనార్దన స్వామి ఆల యంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యుడు శ్రీనివాసులు తెలిపారు.

దత్తజయంతికి షిర్డీసాయి మందిరం

పెనుకొండ, డిసెంబరు 21 : దత్త జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని దక్షిణ షిర్డీగా పేరుగాంచిన 76ఏళ్ల చరిత్రకలిగిన ఈ షిర్డీ సాయి మందిరం ప్రత్యేక అలంకరణతో ముస్తాబైంది. సోమవారం దత్త జయంతిని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శాస్ర్తి, పంచాంగం నాగప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించనున్నట్లు మందిరం నిర్వా హకుడు రఘునాథ్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 4గంటల నుంచిసాయినామ సంకీర్తనల ఆలాపన నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.

Updated Date - Dec 22 , 2023 | 12:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising