ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సినీఫక్కీలో చోరీ

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:57 PM

పట్టణంలో పట్టపగలే సినీఫక్కీలో బైక్‌ బ్యాగ్‌లో ఉన్న రూ.1.60లక్షలు అపహరించారు. మంగళవారం మ ధ్యాహ్నం పట్టణంలోని ఆర్టీసీ బ స్టాండ్‌ దగ్గర ఉన్న ఓ ఎరువుల దుకాణం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

బైక్‌ నుంచి రూ.1.60 లక్షల అపహరణ

ఫ రైతు దృష్టి మళ్లించి నగదు ఎత్తుకెళ్లిన దుండగులుగుత్తి,డిసెంబరు26: పట్టణంలో పట్టపగలే సినీఫక్కీలో బైక్‌ బ్యాగ్‌లో ఉన్న రూ.1.60లక్షలు అపహరించారు. మంగళవారం మ ధ్యాహ్నం పట్టణంలోని ఆర్టీసీ బ స్టాండ్‌ దగ్గర ఉన్న ఓ ఎరువుల దుకాణం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మాలిళ్ల పల్లి గ్రామానికి చెందిన నాగేశ్వర రావు అనే రైతు తన కుటుంబ అవసరాల నిమిత్తం బంగారు నగలను స్థానిక కెనరా బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ. 1.60లక్షలు తీసుకున్నాడు. అతని ద్విచక్రవాహనంలో బ్యాగ్‌లో డబ్బు ఉంచుకున్నాడు. బ్యాంక్‌ సమీపంలో కాపుకాసిన గుర్తుతెలియని దుండుగులు అతన్ని అనుసరించి బస్టాండ్‌ సమీపంలోని ఓ ఎరువుల దుకాణం వద్ద రైతు బైక్‌ను నిలపివుండగా మరో రెండు బైక్‌ల్లో వచ్చిన నలుగురు దుండగులు రైతు బైక్‌ వద్ద రూ. 100 పడేసి ఆ రైతుకు డబ్బులు పడిపోయాయని చెప్పి అతని దృష్టి మల్లించారు. ఆ రైతు రూ.100 తీసుకునే క్రమంలో బైక్‌లో ఉన్న రూ. 1.60లక్షలను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు తిరిగి చూసేలోపు వారు ఉడాయించారు. రైతు లబోదిబో మంటూ బోరున విలపించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి సీఐ వెంకటరామి రెడ్డి చేరుకొని పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాలో చోరీ చేస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Updated Date - Dec 26 , 2023 | 11:57 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising