ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నాగులమడకకు పాదయాత్ర

ABN, First Publish Date - 2023-10-30T00:14:38+05:30

మండలకేంద్రంలోని పెద్ద ఆంజనేయస్వామి దేవాలయం నుంచి నాగులమడక వరకు భక్తులు పా దయాత్ర చేపట్టారు.

రొద్దం/పావగడ, అక్టోబరు 29: మండలకేంద్రంలోని పెద్ద ఆంజనేయస్వామి దేవాలయం నుంచి నాగులమడక వరకు భక్తులు పా దయాత్ర చేపట్టారు. రొద్దంలోని శ్రీరామభక్తమండలి ఆధ్వర్యంలో దాదాపు మూడు వేల మంది భక్తులు పాదయాత్రగా ఆదివారం బయ లుదేరారు. ఉదయం 6గంటలకే పెద్ద ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేసి, సీతారామలక్ష్మణ ఆంజనేయ ఉత్సవ విగ్రహాలకు హారతు లు ఇచ్చి పాదయాత్రను ప్రారంభించారు. రొద్దం ఆర్‌ మరువపల్లి, గౌరాజుపల్లి, ఎం కొత్తపల్లి, పెండ్లిజీవి గ్రామాల మీదుగా నాగులమడక సుబ్రహణ్యస్వామి దేవాలయం చేరుకున్నారు. వృద్దులు యువకులు, పిల్లలు, ఉత్సాహంతో తరలివెళ్లారు. శనివారం రాత్రి రాహు, కేతు గ్రహా లు రాశులు మారుతుండడం, చంద్రగ్రహణం వల్ల గ్రహదోష నివారణ కోసం పాదయాత్ర చేపట్టినట్టు భక్తులు తెలిపారు. అలాగే నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆల యంలో పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో గిరీష్‌కుమార్‌, లక్ష్మీకాంత, నాగరాజు, హిందూపురం తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు హరీష్‌, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి పవన, రుద్రప్రసాద్‌, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-30T00:14:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising