మూడిళ్లలో చోరీ
ABN, First Publish Date - 2023-11-10T00:16:58+05:30
మండలంలోని కరావులపల్లిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రామాలయం వద్ద గల హుండీతో పాటు, మూడు ఇళ్లలో చోరీలకు పాల ్పడ్దారు.
గోరంట్ల, నవంబరు 9: మండలంలోని కరావులపల్లిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రామాలయం వద్ద గల హుండీతో పాటు, మూడు ఇళ్లలో చోరీలకు పాల ్పడ్దారు. గ్రామంలో శివాలయం నిర్మాణ పనులు జరుగుతుండడంతో హుండీని సమీపంలోని రామాలయం వద్ద ఆరుబయట ఇనుప గొలుసులతో బంధించి ఉంచారు. దుండగులు ఆ హుండీని ఎత్తుకెళ్లి, సమీపంలోని చెరువులో హుండీని పగలకొట్టి, డబ్బు తీసుకెళ్లినట్లు గ్రామస్థులు చెప్పారు. అలాగే తిమ్మిరెడ్డి అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి పెడబల్లికి వెళ్లాడు. దుండగులు ఆ ఇంటి తాళాన్ని బద్దలుకొట్టి, ఇంట్లోని వస్తువులను చెల్లాచెదురుగా చేసినట్లు బాధితుడు తెలిపారు. విలువైన వస్తువులు లభించినట్లు స్థానికులు అంటున్నారు. గ్రామంలోని కొత్తక్వార్టర్స్ లోని మహే్‌షబాబు బెంగుళూరులో ఉంటున్నాడు. కొత్తక్వార్టర్స్‌లోని అతడి ఇంటి తాళం పగలకొట్టి రెండు పట్టుచీరలు, వెండి పళ్లెం, దేవుడి సామాగ్రి ఎత్తుకెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అలాగే వడ్డె అచ్చమ్మ ఇంటికి తాళం వేసి బంధువులను చూడడానికి పోగూరు వెళ్లగా చోరీ జరిగింది. ఆమె లేకపోవడంతో చోరీ వివరాలు తెలియలేదు. శివాలయం పూజారి శ్రీనివాసులు మాట్లాడుతూ... పదినెలల కిందట హుండీని లెక్కించామని తెలిపారు. తరువాత ప్రజలు వేసిన సొమ్ము చోరీ జరిగిందన్నారు. పూజారి, ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదుమేరకు పోలీసులు సంఘటనాస్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీమ్‌ను పిలిపించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ఇళ్ల యజమానులెవరూ లేకపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు.
Updated Date - 2023-11-10T00:16:59+05:30 IST