ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సచివాలయ హెల్త్‌ సెక్రటరీలకు పనిభారం తగ్గించాలి

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:52 PM

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామవార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీలకు పనిభారం తగ్గించాలని ఏపీ గ్రామ వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీ ఆసోసియేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలావతి డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న హెల్త్‌ సెక్రటరీ అసోసియేషన కార్యదర్శి లీలావతి

పుట్టపర్తిరూరల్‌, డిసెంబరు 17: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామవార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీలకు పనిభారం తగ్గించాలని ఏపీ గ్రామ వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీ ఆసోసియేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలావతి డిమాండ్‌ చేశారు. స్థానిక సాయి ఆరామంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అంజనేయులు, ఉప కార్యదర్శి సాంబశివ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీలతో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. సచివాలయాల్లో పనిచేసే ఇతర ఉద్యోగులకు లేని పనిభారం ఏఎనఎమ్స్‌కు ఉందన్నారు. దాదాపు 50 రకాల ఆనలైనయా్‌పల కారణంగా గర్భవతులకు, బాలింతలకు, చంటిపిల్లలకు మెరుగైన సేవలు అందించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనికి తోడు అధికారుల వేధింపులు అధికమయ్యాయన్నారు. సచివాలయ ఉద్యోగులకు అంగనవాడీల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు అధికారులు మానుకోవాలన్నారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, యూనిఫాం అలవెన్సులు, సాధారణ బదిలీల సౌకర్యం కల్పించాలని కోరారు. అసోసియేషన జిల్లా కార్యదర్శి పరిమిళ, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌కుమార్‌, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పవనకుమార్‌, రాజేంద్ర ప్రసాద్‌, పద్మాపుష్పలత, గౌసియా, అనితాకుమారి, రిహానా, జ్యోతి పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:52 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising