బాబుతోనే రాష్ట్ర ప్రగతి
ABN, First Publish Date - 2023-12-03T23:43:13+05:30
మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని శింగనమల నియోజకవర్గ ఇనచార్జి బండారు శావణీశ్రీ అన్నారు.
బుక్కరాయసముద్రం, డిసెంబరు 3: మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని శింగనమల నియోజకవర్గ ఇనచార్జి బండారు శావణీశ్రీ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని సిద్దరాంపురంలో బాబు ష్యూరిటీ ... భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. రచ్చబండ నిర్వహించి.. టీడీపీ అమలు చేయబోయే పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఆ పథకాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు జిల్లా ఉపాధ్యాక్షుడు పసుపుల హనుమంతురెడ్డి, నియోజకవర్గం టీడీపీ నేత బండారు రవికుమార్, బండారు లీలావతి, పొడరాళ్ల రవీంద్రా, జీసీబాబు, పెద్దప్ప, ఓబులపతి పాల్గొన్నారు
Updated Date - 2023-12-03T23:43:15+05:30 IST