సమగ్రశిక్ష ఉద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి
ABN, Publish Date - Dec 23 , 2023 | 12:48 AM
పుట్టపర్తిరూరల్, డిసెంబరు 22: సమగ్రశిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిస్కరించాలని మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- మాజీమంత్రి పల్లె డిమాండ్
పుట్టపర్తిరూరల్, డిసెంబరు 22: సమగ్రశిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిస్కరించాలని మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద గత రెండురోజులుగా సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న సమగ్రశిక్ష కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పల్లె శుక్రవారం మద్దతు ఇచ్చి ఇచ్చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ వ్యవస్థలను బ్రష్టు పట్టించిందన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో జీతాలు పెంచకుండా, ఉన్నజీతాలు ఒకటోతారీఖున ఇవ్వకుండా ఉద్యోగులను అష్టకష్టాలపాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ ప్రభుత్వంపై వ్యతిరేకతతో రోడ్డుపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తుంటే సీఎం జగన నిమ్మకు నీరెత్తినెట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులు న్యాయమైన సమస్యలను వెంటనే పరిస్కరించాలన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబు తారని హెచ్చరించారు. సమగ్రశిక్ష ఉద్యోగులకు సమానపనికి సమానవేతనం చెల్లించాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలుపెంచి పర్మినెంట్ చేయాలని, పదవీవిరమణ సమయంలో రావాల్సిన బెనిఫిట్స్ తో పాటు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వేతనాలు, హెచఆర్‌ఏ పాలసీను అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు ప్రతినెలా ఒకటోతారీఖున జీతాలు చెల్లించాలని పల్లె డిమాండ్ చేశారు. అంతకు మునుపు సమగ్రశిక్ష ఉద్యోగులు సీఐటీయూ నాయకుడు ఈఎస్ వెంకటేసుతో కలిసి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష యూనియన నాయకులు ఓబిరెడ్డి, నరసింహులు, టీడీపీ,జనసేన నాయకులు ఉమాపతి యాదవ్, జయప్రకాష్, అబ్దుల్ పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2023 | 12:48 AM