ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు

ABN, Publish Date - Dec 14 , 2023 | 12:32 AM

మండలంలోని కదిరేపల్లి గ్రామ సచివాలయంలో బుధవారం కేంద్ర బృందం ఉంది. కరువు రైతులను ఆదుకోవాలంటూ కేంద్రబృందానికి వినతి పత్రాన్ని ఇవ్వడానికి టీడీపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, పట్టణ, మండల కన్వీనర్లు మనోహర్‌, లక్ష్మీనారాయణ, మైనార్టీ నాయకుడు భక్తర్‌ వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

కేంద్ర బృందానికి వినతి పత్రాన్ని అందజేస్తున్న టీడీపీ నాయకులు

పోలీసులతో వాగ్వాదం... చివరకు సీఐ అనుమతి

కరువు రైతును ఆదుకోవాలని కేంద్ర బృందానికి వినతి

మడకశిర రూరల్‌, డిసెంబరు 13: మండలంలోని కదిరేపల్లి గ్రామ సచివాలయంలో బుధవారం కేంద్ర బృందం ఉంది. కరువు రైతులను ఆదుకోవాలంటూ కేంద్రబృందానికి వినతి పత్రాన్ని ఇవ్వడానికి టీడీపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, పట్టణ, మండల కన్వీనర్లు మనోహర్‌, లక్ష్మీనారాయణ, మైనార్టీ నాయకుడు భక్తర్‌ వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయమై శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ టీడీపీ అనుమతి తీసుకుందన్నారు. చివరకు సీఐ ఆదేశాలతో పోలీసులు అనుమతిచ్చారు. టీడీపీ నాయకులు కేంద్ర బృందం వద్ద మాట్లాడుతూ... నియోజకవర్గంలో తీవ్ర కరువుతో నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని కేంద్ర కరువు బృందం ప్రతినిధి దేవేందర్‌ రావ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్‌, మైనార్టీ అధ్యక్షుడు భక్తర్‌, నాయీబ్రహ్మణ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, క్లస్టర్‌ ఇనచార్జ్‌ రమేష్‌కన్నా, నాయకులు శ్రీనివాసులు, కృష్ణమూర్తి, కార్యకర్తలు పాల్గొన్నారు.

బీజేపీ, రైతు సంఘం నాయకుల వినతి

మడకశిర రూరల్‌: నియోజకవర్గంలో శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టాలని బీజేపీ, రైతు సంఘం నాయకులు విడివిడిగా కేంద్ర కరువు బృందానికి వినతులు అందజేశారు. బీజేపీ కిసాన మోర్చారాయల సీమ జోనల్‌ ఇనచార్జి చంద్రశేఖర్‌, రైతు సంఘం నాయకులు సోమకుమార్‌, వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 12:32 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising