ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్తు

ABN, First Publish Date - 2023-11-10T23:48:47+05:30

ఆంధ్రప్రదేశ రాష్ట్ర భవిష్యత్తు టీడీపీ ఽఅధినేత చంద్రబాబు నాయుడుతోనే ముడిపడిఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు.

జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి

పెనుకొండ టౌన, నవంబరు 10: ఆంధ్రప్రదేశ రాష్ట్ర భవిష్యత్తు టీడీపీ ఽఅధినేత చంద్రబాబు నాయుడుతోనే ముడిపడిఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు. సోమందేపల్లి మం డలం చల్లాపల్లి పంచాయతీ ఓబుళదేవరపల్లిలో శుక్రవారం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఇటీవల టీడీపీ విడుదల చేసిన మినీ మేనిఫేస్టో గురించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. అడుగడుగునా రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని పార్థసారథితో గ్రామస్థులు వాపోయారు. ఈ క్రమంలో బీకే మాట్లాడుతూ, అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం అందిస్తామని, ప్రతి నిరుద్యోగికి యువగళంనిధి కింద నెలకు రూ.3వేలు నిరుద్యోగభృతి అందిస్తామన్నారు. అధికారం చేపట్టిన ఐదేళ్లలో పేదల ఆదాయం రెట్టింపు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు చారిత్రాత్మక అవసరమన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిలమత్తూరు: టీడీపీతోనే రాష్ర్టానికి భవిష్యత్తని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం భవిషత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి అందే సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రజా కంటక పాలనను కొనసాగిస్తోందన్నారు. ప్రజలపై భారం మోపి వారి రక్తాన్ని పీల్చుతున్నట్లు పన్నులను ముక్కుపిండి వసూలు చేస్తోందన్నారు. ఒక పక్క పథకాల పేరుతో నగదు ఇస్తూ మరో పక్క రెట్టింపుగా పన్నుల రూపంలో వసూళ్లు చేస్తోందన్నారు. కనుక ప్రజలకు మేలు జరగాలంటే చంద్రబాబుని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తుకు గ్యారెంటీ సూపర్‌ సిక్సర్‌ మేనిఫెష్టో కరపత్రాలను పంచి హామీలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందీషప్ప, నాగరాజు, గంగాదర్‌, పరిటాల వెంకటేశులు, నరసప్ప, కదిరప్ప, వెంకటరాముడు, ఎనబికే మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T23:48:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising