వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలి
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:05 PM
వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలని తెలుగు యువత నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని కృష్ణ కళామందిరం నుంచి క్లాక్ టవర్ వరకు రాంగోపాల్ వర్మ దిష్టి బొమ్మతో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెలుగు యువత నాయకుల మండిపాటు
అనంతపురం అర్బన, డిసెంబరు 26: వ్యూహం సినిమాను బ్యాన చేయాలని తెలుగు యువత నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని కృష్ణ కళామందిరం నుంచి క్లాక్ టవర్ వరకు రాంగోపాల్ వర్మ దిష్టి బొమ్మతో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, తెలుగు యువత నాయకులు ప్రతిఘటించారు. ఆర్జీవీ దిష్టిబొమ్మతోపాటు సీఎం, మంత్రుల ఫొటోలను మంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడుపూటి నారాయణ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రోద్బలంతో ప్రతిపక్ష నాయకులను కించపరిచేలా సినిమాలు చేయడం రాంగోపాల్ వర్మకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. సీఎం జగన్ నేరుగా చంద్రబాబును ఎదుర్కోలేక లుచ్చా రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యూహం సినిమాను బ్యాన్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్ గౌడ్, సరిపూటి శ్రీకాంత, కృష్ణ, నరేష్, పవన తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 11:55 PM