ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:36 AM

రేషన బియ్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స ఎస్పీ మునిరామయ్య తెలి పారు. ఇకపై నిత్యావసర వస్తువుల చట్టం(ఈసీ యాక్ట్‌)తో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. నగరంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

పట్టుబడిన బియ్యంతో విజిలెన్స అధికారులు

విజిలెన్స ఎస్పీ మునిరామయ్య

అనంతపురం న్యూటౌన, డిసెంబరు 16: రేషన బియ్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స ఎస్పీ మునిరామయ్య తెలి పారు. ఇకపై నిత్యావసర వస్తువుల చట్టం(ఈసీ యాక్ట్‌)తో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. నగరంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం కిలో బియ్యాన్ని రూ.44కు కొని, కార్డుదారులకు ఉచితంగా ఇస్తోందని అన్నారు. లబ్ధిదారులు ఆ బియ్యాన్ని విక్రయించకుండా, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫోర్టిఫైడ్‌ బియ్యంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. తాడిపత్రి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో భారీగా అక్రమాలు జరిగాయని, 6వేల క్వింటాళ్ల బియ్యం, ఇతర సరుకులు మాయమయ్యాయని తెలిపారు. అక్కడి అక్రమాలపై నాన బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, పోయిన సరుకుకు రెండింతలు రికవరీ చేసేలా రూ.5.86 కోట్ల జరిమానా విధించామని తెలిపారు. డిసి్ట్రబ్యూషన యూనిట్లను కూడా ఆకస్మికంగా తనిఖీ చేస్తామని, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండేలా ఫిర్యాదుల సెల్‌ ఎర్పాటు చేశామని తెలిపారు. ఎప్పుడు ఎలాంటి అక్రమాలు జరిగినా 08554 241249 నంబరుకి ఫోన చేసి వివరాలు చెప్పవచ్చునని అన్నారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. హోటల్స్‌లో ఇబ్బంది ఉన్నా, పదార్థాల నాణ్యతలో తేడా ఉన్నా, తూకాల్లో తేడా ఉన్నా, ఎరువుల దుఖానాల్లో సమస్య ఉన్నా ఫిర్యాదు చేయాలని సూచించారు.

విజిలెన్స విస్తృత దాడులు...

ఉమ్మడి జిల్లాలో విజిలెన్స అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో రాప్తాడు మండలం హంపాపురం వద్ద తనికీలు చేపట్టారు. ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న 630 ప్యాకెట్ల రేషన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాప్తాడు సీఎ్‌సడీటీ జ్యోతికి అప్పగించారు. బియ్యం తరలిస్తున్న నాగనాథ్‌, లారీ డ్రైవర్‌ రాజ్‌కుమార్‌ యాదవ్‌, లారీ యజమాని శేఖర్‌పై కేసు నమోదు చేశారు. తనికీల్లో ఏఓ వాసుప్రకాస్‌, ఎస్‌ఐ జయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బత్తలపల్లి మండలం మాల్యవంతంలో 23 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్‌ చేశారు. డీలర్‌ పుణ్యవతి నిర్వహిస్తున్న 1231015 నంబరు రేషన దుకాణాన్ని ఎస్‌ఐ శేషగిరి ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. రికార్డుల్తో తేడా ఉన్నట్లు గుర్తించి, 23 క్వింటాళ్ల బియ్యం, 198 ప్యాకెట్ల చక్కరను సీజ్‌ చేశారు. తనిఖీల్లో ఏఈఈ రాజశేఖర్‌, బత్తలపల్లి సీఎ్‌సడీటీ శారద, వీఆర్వో మణికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:36 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising