ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘బాబు ష్యూరిటీ’ ని వేగవంతం చేయండి : బీకే

ABN, First Publish Date - 2023-12-10T23:53:33+05:30

బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థ సారథి సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న బీకే పార్థసారథి

పెనుకొండ, డిసెంబరు 10 : బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థ సారథి సూచించారు. ఆయన ఆదివారం గోరంట్ల పట్టణంలో క్లస్టర్‌ యూనిట్‌ ఇనచార్జ్‌లు, పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీకే మాటా ్లడుతూ పార్టీ చేపట్టిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ, టెలిగ్రాం బ్యాట్‌ నమోదు కార్యక్రమం వేగవంతంగా చేపట్టాలని తెలిపారు. అలాగే ఓటర్ల నమోదు జాబితా పరిశీలనలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అందులో భాగంగా దొంగ ఓట్ల నమోదు, డబుల్‌ ఎంట్రీ, చనిపోయిన వారి ఓట్లను గుర్తించి అధికారులకు తెలియజేయాలన్నారు. పార్టీ చేపట్టిన అన్ని కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో దేవా నరసింహప్ప, అశ్వత్థరెడ్డి, మనోహర్‌, తిరుపాల్‌, చంద్ర, వెంకటేశప్ప, అమర్‌, రంగనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తాం : టీడీపీ

రొళ్ల: మండలంలోని దొడ్డేరి పంచాయతీ కొత్తపల్లిలో టీడీపీ నాయకులు ఆదివారం బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్ర మం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్డులను పంపిణీ చేశారు. ఈసందర్బంగా టీడీపీ మండల అధ్యక్షుడు దాసిరెడ్డి మాట్లాడుతూ... 2024లో నారా చంద్రబాబునాయుడు ఖచ్చితంగా ముఖ్య మంత్రి అవుతారని, ఈ హామీలన్నీ నెరవేరుస్తారని తెలియజేశారు. సీఎం జగన పాలనలో ఇంతవరకు ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్‌ ఇనచార్జ్‌ భరత, మాజీ ఎంపీటీసీ చంద్రప్ప, తెలుగు యువత మండల అధ్యక్షుడు ఉమేష్‌, హనుమంతరాయప్ప, మురళి, శనివారప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:53:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising