రజకులకు ప్రత్యేక చట్టం: పల్లె
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:53 PM
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రజకులకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, వారిని అన్నివిధాల ఆదుకుంటామని, ప్రత్యేక కార్పొరేషన ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు.
పుట్టపర్తి, డిసెంబరు 17: టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రజకులకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, వారిని అన్నివిధాల ఆదుకుంటామని, ప్రత్యేక కార్పొరేషన ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో రజక సాఽధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గుర్రపుశాల రామక్రిష్ణ ఆధ్వర్యంలో భవిష్యత గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. పల్లె మాట్లాడుతూ రానున్న ఎన్నికలు ఎంతో కీలకమన్నారు. ప్రజావ్యతిరేక విధనాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీకి పూర్వవైభం తీసుకురావడనికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి అంబులెన్సు రమేష్, రజక సంఘం జిల్లా కన్వీనర్ మల్యావంతపు రామచంద్ర, నాయకులు ఆంజనేయులు, గంగాధర్, రామాంజనేయులు, రాధమ్మ, చెన్నక్రిష్ణమ్మ పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 11:53 PM