తల్లిదండ్రులకు సేవతోనే మోక్షం
ABN, First Publish Date - 2023-12-10T23:43:34+05:30
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవలు చేయడం ద్వారానే అల్లా మోక్షమార్గాన్ని చూపుతారని సయ్యద్ అబ్దుల్ హబీబ్ సాహెబ్ పేర్కొన్నారు
అనంతపురం కల్చరల్, డిసెంబరు 10: జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవలు చేయడం ద్వారానే అల్లా మోక్షమార్గాన్ని చూపుతారని సయ్యద్ అబ్దుల్ హబీబ్ సాహెబ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తెహరీక్ పైజానే ఉమర్ ఫారుక్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సున్నీ ఇజ్‌తేమాకు భూసావల్‌కు చెందిన సయ్యద్ అబ్దుల్ హబీబ్ సాహెబ్ ముఖ్యఅతిథిగా హాజరై ఆధ్యాత్మిక బోధనలు చేశారు. స్వర్గం తల్లిపాదాల వద్దే గలదని, తండ్రి ఆ స్వర్గానికి ముఖద్వారమని అన్నారు. ప్రతి కోడలు తన అత్తను తల్లితో సమానంగా చూడాలని, అలాగే ప్రతి అత్త తన కోడలిని కుమార్తెగా భావించాలని సూచించారు. ఈ సున్నీ ఇజ్‌తేమాకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ముస్లింలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కా ర్యక్రమంలో తెహరీక్ అధ్యక్షుడు హాసన రాజా ఖాద్రి, సభ్యులు ముతవల్లి ఫరీ దుద్దీన, పర్వీష్, షబ్బీర్ అహ్మద్, హబీబ్, డాక్టర్ షఫి, ఆవాజ్ వలి, అరీఫ్, అబ్దుల్ సమి, చాంద్‌బాషా, మహబూబ్‌బాష, హుస్సేన, జనబలం బాబా పాల్గొన్నారు.
Updated Date - 2023-12-10T23:43:35+05:30 IST