ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

10వ తేదీకి కూడా జీతాలు చెల్లించట్లేదు

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:56 PM

ప్రతి నెలా 10వ తేదీ వచ్చినా ఉపాధ్యాయులకు జీతాలు అందడం లేదని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.

మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు

ఫ సీపీఎస్‌ రద్దు హామీ మరచి ఉద్యోగులకు మోసం

: ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు

రాప్తాడు, డిసెంబరు 17: ప్రతి నెలా 10వ తేదీ వచ్చినా ఉపాధ్యాయులకు జీతాలు అందడం లేదని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చి 5ఏళ్లు పూర్తి కావస్తున్నా ఉపాధ్యాయ రంగ సమస్యలు తీర్చకపోగా, కొత్త సమస్యలు తెచ్చారన్నారు. సీపీఎస్‌ రద్దు మాట మార్చి ఉపాధ్యాయ, ఉద్యోగులను మోసం చేశారని, దీర్ఘకాలికంగా నిలిచిపోయిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. 160 నెలల డీఏ బకాయిలు చెల్లించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన బీపీఎస్‌, ఓపీఎస్‌ మరచిపోయి ఎవరూ అడగని జీపీఎస్‌ ఇచ్చి ఉపాధ్యాయులను మోసం చేశారన్నారు. పాఠశాల నిధులు లేకపోవడంతో విద్యుత బిల్లులు చెల్లించలేని స్థితిలో, విద్యుత శాఖ కనెక్షన్లు తొలగిస్తున్నారన్నారు. సమగ్రశిక్ష కార్యాలయాల్లో పని చేసే వారికి నాలుగు నెలలైనా జీతాలు ఇవ్వలేదని వారు కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏపీటీఎఫ్‌ జిల్లా అద్యక్షుడు రాయల్‌ వెంకటేష్‌, ప్రదాన కార్యదర్శి సిరాజుద్దిన, అసోషియేట్‌ ప్రదాన కార్యదర్శి హనుమప్ప, జిల్లా సబ్‌ కమిటీ సభ్యులు బొమ్మ య్య, మోహనరెడ్డి, గాయత్రి, రామాంజినేయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising