ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిబంధనలు తెచ్చిన తిప్పలు

ABN, First Publish Date - 2023-11-22T00:06:23+05:30

ప్రభుత్వం అందించే విద్యాదీవెనకు సంబంధించి ఈ సంవత్సరం కొత్త నిబంధనలు విధించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఖాతా తెరవడానికి బ్యాంక్‌ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు

ఉమ్మడి ఖాతా తెరవడానికి అవస్థలు పడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

మడకశిర రూరల్‌, నవంబరు 21 : ప్రభుత్వం అందించే విద్యాదీవెనకు సంబంధించి ఈ సంవత్సరం కొత్త నిబంధనలు విధించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు అందించే సొమ్మును వారి తల్లి బ్యాంక్‌ ఖాతలోకి జమచేస్తూవచ్చారు. ఈ సంవత్సరం విద్యాదీవెన పథకంలో నిబంధనలు మార్చడం, తక్కువ సమయం ఇవ్వడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బ్యాంక్‌ల్లో కొత్త ఖాతాలు తెరవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థికి, తల్లికి సంబంధించిన ఉమ్మడి బ్యాంక్‌ ఖాతా మాత్రమే ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అం తేకాకుండా ఈ నెల 24 తేదీలోగా ఖాతా ఇవ్వాలని గడువు పెట్టారు. దీంతో ఉమ్మడి ఖాతా ప్రాంభించడానికి విద్యార్థులు, వారి తల్లిడండ్రులు బ్యాం కుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలా బ్యాంకుల్లో జీరో ఖాతాలు ప్రారంభిచడంలేదు. కొత్తగా ఖాతా ప్రాంభించాలంటే రూ.1000 చెల్లించాల్సిఉంది. దీంతో చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అవస్థలు పడాల్సి వస్తోంది. అలాగే వేరే ప్రాంతాల్లో చదువుతున్న్న విద్యార్థులు కాలేజీలకు సెలవు పెట్టి స్వగ్రామాలకు వచ్చి బ్యాంకులో ఖాతా తెరుస్తున్నారు. మండల వ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంక్‌లు టీటకీటలాడుతున్నాయి. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు మార్చలని విద్యార్థుల తల్లీ దండ్రులు కోరుతున్నారు.

నిబంధనలను సడలించాలి - మురళిబాబు, టీఎనఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు

ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న విద్యాదీవెన పథకం వర్తిం చేందుకు ఈ సంవత్సరం విధించిన కొత్త నిబంధనల ను సడలించాలి. గతంలో ఉన్న విధంగా నే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకే ఆ మొ త్తాన్ని జమచేయాలి. విద్యార్థి, తల్లికి సం బంధించి బ్యాంక్‌లో కొత్తగా ఉమ్మడి ఖాతా ప్రారంభించాలంటే రూ.1000 డిపాజిట్‌ చేయాల్సి వస్తోంది. దీనికోసం పేద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాల మంది దూరప్రాంతాలనుంచి స్వగ్రామాలకు వస్తున్నారు. వారు వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. ఈ పథకంలోని కొత్త నిబంధనలు సడలించాలని ప్రభుత్వన్ని డిమాండ్‌ చేస్తున్నాం

Updated Date - 2023-11-22T00:06:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising